Home » Telangana Result
Telangana Election Results : తెలంగాణ హస్త ‘గతం’ అయ్యింది.. కౌంటింగ్ ప్రారంభమైన 8 గంటల సమయం నుంచి ఇప్పటి వరకూ ఏం జరిగిందనే ఆసక్తికర విషయాలు ఇక్కడ చూడొచ్చు..
Telangana Results: తెలంగాణ వ్యాప్తంగా మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయబావుటా ఎగురవేశారు. పలువురు అభ్యర్థులు గెలుపు దిశగా ముందుకు దూసుకెళ్తున్నారు. అయితే హైదరాబాద్‌లో మాత్రం అధికార పార్టీ బీఆర్ఎస్ మెజార్టీ స్థానాల్లో గెలుపొందింది.
Telangana Results: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగిస్తోంది. ఈసారి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా స్పష్టమైన మెజార్టీ కనబడుతోంది.
Telangana Results: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఆరు రౌండ్లు ముగిశాయి.
Telangana Result: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై మంత్రి, వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుందుభి మోగిస్తోంది.
Telangana Results: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గాంధీభవన్‌కు బయలుదేరారు. జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి భారీ ర్యాలీగా గాంధీభవన్‌కు రేవంత్ వెళ్లారు. అలాగే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా గాంధీభవన్‌కు చేరుకున్నారు. తెలంగాణలో అధికారం చేపట్టే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది.
Telangana Results: తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుంటే.. హైదరాబాద్‌లో మాత్రం అధికార పార్టీ బీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఇప్పటికే మూడు రౌండ్లు పూర్తవగా నగరంలోని పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు తమ ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు.
Telangana Results: తెలంగాణ ఎన్నికల్లో అధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్‌లో ఉండటంతో ఆ పార్టీ నేతలు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలు జూబ్లీహిల్స్‌లోని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకుని బాణాసంచా కాల్చుతూ సంబరాలు చేసుకుంటున్నారు.
Telangana Results: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 10 స్థానాల్లో కాంగ్రెస్, 2 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
Telangana Results: ఉమ్మడి మెదక్ జిల్లాలోని 11 నియోజకవర్గాలో బీఆర్ఎస్ 6 స్థానాల్లో, కాంగ్రెస్ ఐదు స్థానాల్లో ఆధిక్యంలో నిలిచింది. గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, జహీరాబాద్, సంగారెడ్డి, పఠాన్ చెరు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.