Share News

Telangana Results: రేవంత్ ఇంటికి ఏపీ అభిమానులు.. రేవంత్ సీఎం అవ్వాలంటూ..

ABN , First Publish Date - 2023-12-03T11:18:13+05:30 IST

Telangana Results: తెలంగాణ ఎన్నికల్లో అధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్‌లో ఉండటంతో ఆ పార్టీ నేతలు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలు జూబ్లీహిల్స్‌లోని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకుని బాణాసంచా కాల్చుతూ సంబరాలు చేసుకుంటున్నారు.

Telangana Results: రేవంత్ ఇంటికి ఏపీ అభిమానులు.. రేవంత్ సీఎం అవ్వాలంటూ..

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో అధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్‌లో ఉండటంతో ఆ పార్టీ నేతలు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలు జూబ్లీహిల్స్‌లోని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకుని బాణాసంచా కాల్చుతూ సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే ఏపీ నుంచి రేవంత్ అభిమానులు కూడా టీపీసీసీ చీఫ్ నివాసానికి చేరుకున్నారు. చిత్తూరు జిల్లా నుంచి ఏపీ ఫ్యాన్స్ రేవంత్‌ను కలిసేందుకు వచ్చారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం రేవంత్‌కు ప్రసాదాలు అందజేయడానికి అభిమానులు వచ్చారు. రేవంత్ రెడ్డి సీఎం అవ్వాలని కోరుకున్నట్లు అభిమానులు తెలిపారు. ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎం అయితే ఏపీలో ప్రభావం ఉంటుందని అభిమానులు చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో టీఆర్ఎస్ పార్టీ వ్యహరించిన తీరు సరైన పద్ధతి కాదని ఏపీ అభిమానులు అన్నారు. కాంగ్రెస్ గెలవాలని, రేవంత్ రెడ్డి సీఎం అవ్వాలనేదే తమ కోరికని ఏపీ అభిమానులు తెలియజేశారు.

Updated Date - 2023-12-03T11:18:14+05:30 IST