YSRCP: వైసీపీ నేత అరాచకం.. ఏకంగా కిడ్నాప్ చేసి.. ఏం చేశారంటే..
ABN , Publish Date - Feb 06 , 2025 | 08:43 AM
YSRCP: వైసీపీ నేత మరోసారి రెచ్చిపోయాడు. అమాయకుడిని కిడ్నాప్ చేసి దాడికి పాల్పడ్డాడు. అతనిపై గతంలో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అయిన ఎంతమాత్రం కూడా ఆ వైసీపీ నేత తన ప్రవర్తన తీరు మార్చుకోలేదు. మరోసారి బరితెగించి ఓ కార్పెంటర్‌ను కిడ్నాప్ చేశాడు. ఈ ఘటన ఇప్పుడు గుంటూరు జిల్లాలో సంచలనంగా మారింది.

గుంటూరు జిల్లా : ఏపీ ప్రభుత్వం కఠిన చట్టాలు అమలు చేస్తున్నా కొంతమంది వైసీపీ నేతల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. గత జగన్ ప్రభుత్వంలో అడ్డూ అదుపు లేకుండా ప్రవర్తించారు కొంతమంది వైసీపీ నేతలు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా కూడా వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. మరోసారి బరితెగించి... గుంటూరు జిల్లాలో వైసీపీ నేత అరాచకం సృష్టించాడు. అతని ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అడ్డువచ్చిన వారిని ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. వైసీపీ నేతకు అడ్డుగా ఉన్నా ఓ కార్పెంటర్‌ను కిడ్నాప్ చేసి దాడి చేశాడు. ఈ సంఘటన ఇప్పుడు తెనాలిలో సంచలనంగా మారింది.
వైసీపీ నేతల్లో కానరాని మార్పు..
తప్పు చేసిన వారిని ఎవరినీ వదలబోమని ఏపీ ప్రభుత్వం హెచ్చరిస్తున్నా కొంతమంది వైసీపీ నేతల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. ఫలితంగా అమాయకులు వారి బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తెనాలిలో వైసీపీ కౌన్సిలర్ అహ్మద్ అరాచకం సృష్టించాడు. కార్పెంటర్ షేక్ మస్తాన్ వలీని కిడ్నాప్ చేసి దాడికి పాల్పడ్డాడు. షేక్ మస్తాన్ వలీని రూ.10 లక్షలు అడిగితే ఇవ్వలేదని కిడ్నాప్ చేసి, దాడి చేశాడు. మస్తాన్ వలీని కారులో బలవంతంగా ఎక్కించుకుని తెనాలి నుంచి విజయవాడ మార్గంలో తిప్పుతూ అహ్మద్ తీవ్రంగా కొట్టాడు. ఆ తర్వాత మస్తాన్ వలీని అర్థరాత్రి సమయంలో కౌన్సిలర్ అహ్మద్ తెనాలి తీసుకువచ్చాడు. అహ్మద్ చెర నుంచి పారిపోయి ఆస్పత్రిలో కార్పెంటర్ మస్తాన్ వలీ చేరాడు. కిడ్నాప్ విషయం చెబితే కొడుకు, భార్యను చంపుతానని కౌన్సిలర్ అహ్మద్ బెదిరించాడు. షేక్ మస్తాన్ వలీ తెనాలి 3 టౌన్ పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఫిర్యాదు తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ పలు నేరాలకు కౌన్సిలర్ అహ్మద్ పాల్పడ్డాడు. తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని పోలీసులను షేక్ మస్తాన్ వలీ వేడుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ABN ఎఫెక్ట్ : ‘అక్షరమే ఆయుధంగా - పరిష్కారమే అజెండా’కు అనూహ్య స్పందన
MP Magunta Srinivasulu Reddy: ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి అస్వస్థత
Government Hospitals: రోగుల సంతృప్తే ప్రధానం
Read Latest AP News and Telugu News