Home » Tirumala
అలిపిరి(Alipiri)లో భద్రతా తనిఖీల వైఫల్యం మరోసారి వెలుగుచూసింది. అన్యమతనానికి చెందిన వ్యాఖలతో కూడిన ఓ కారు తిరుమలకు రావడం విమర్శలకు దారితీసింది. సాధారణంగా రాజకీయ, ఇతర మతాలకు చెందిన ఫొటోలు, గుర్తులు, నినాదాలతో వాహనాలు తిరుమలకు రావడం నిషేధం.
తిరుమల మహత్యమే అలాంటిది..! ఆ ఏడుకొండల్లో పరుచుకున్న ప్రకృతి సౌందర్యం నడుమ నిల్చుంటే చాలు.. ఆధ్యాత్మిక సౌరభంతో మనసు పులకిస్తుంది.. గోవింద నామస్మరణతో తనువు పుణీతం అవుతుంది. అక్కడే శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో నెలకొల్పిన వేద విజ్ఞాన పాఠశాల ఆవరణలోకి వెళితే.. ‘వేదంలా ఘోషించే గోదావరి..’ పాట గుర్తుకు వస్తుంది.
తుఫాను ప్రభావంతో తిరుమలలో శనివారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.
తన భర్తతో జరిగిన గొడవ కారణంగా తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ ఓ యువతి తిరుమల(Tirumala) నుంచి తన అన్నకు వీడియో పంపింది. దీనిపై అతడు నిమిషాల వ్యవధిలో ఇక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. గంట వ్యవధిలోనే ఆమెను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం దర్యాప్తును సిట్ వేగవంతం చేసింది. అందులోభాగంగా గురువారం లడ్డూ తయారీ కేంద్రమైన పోటులో సిట్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లడ్డూ తయారీ, నెయ్యి వినియోగంపై సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల పాలనలో తిరుమలలో చాలా మార్పులు వచ్చాయని, పూర్వ వైభవం తీసుకువచ్చామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. గతంలో భక్తులు అనేక ఇబ్బందులు పడే వారని.. ప్రస్తుతం సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన స్వామి వారి దర్శనం కల్పిస్తున్నామని తెలిపారు.
అలిపిరి మెట్ల మార్గంలో బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ తన వెకిలి చేష్టలతో మరోసారి వార్తల్లో నిలిచింది. బాయ్ ఫ్రెండ్ శివకుమార్‌తో కలిసి తిరుమలకు ప్రియాంక విచ్చేసింది. ఆ క్రమంలో తిరుమల మెట్ల మార్గంలో చిరుత సంచరించే ఏడో మైలు రాయి వద్ద తన ప్రియుడితో కలిసి ప్రియాంక రీల్స్ చేసింది.
తిరుమలలో మఠాల నిర్వహణపై అరోపణలు పెరగడంతో, వీటిపై నియంత్రణ చర్యలకు టీటీడీ శ్రీకారం చుట్టింది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సోమవారం అధికారులతో సమీక్షించారు.