Home » Trending
మద్యం ప్రియులకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వెరీ స్పెషల్. తాగిన తర్వాత కొందరు రోడ్లపైకి వచ్చి న్యూసెన్స్ చేయడం, లేదా సొంత వాహనాలను నడుపుకుంటూ వెళ్లి పోలీసులకు దొరకిపోతుంటారు. ఈ క్రమంలో మద్యంపై మక్కువతో ఎక్కువ తాగినా పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
నీటి ప్రవాహాన్ని దాటేందుకు ఓ చీమల గుంపు వంతెన నిర్మించిన వైనం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ భూమ్మీద చీమలకు మించిన సివిల్ ఇంజినీర్లు లేరని జనాలు వీడియో చూసి కామెంట్ చేస్తున్నారు.
బాస్ తనను అనకూడని మాటలు అంటున్నారంటూ ఓ 21 ఏళ్ల యువకుడు పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. అలాంటి వాళ్లను నిలబెట్టి దుమ్ముదులిపితేనే అదుపులో ఉంటారని నెటిజన్లు అతడికి సలహా ఇచ్చారు.
ప్రజలంతా 2024కు వీడ్కోలు పలికేందుకు రెడీ అయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కొత్త సంవత్సర వేడుకలను భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరిట వేల సంఖ్యలో ఈవెంట్లను హైదరాబాద్ నగరంలో ఏర్పాటుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఈ ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పొరపాటున ఈ రూట్లలో వెళ్లారో ఇక అంతే..
న్యూ ఇయర్ పార్టీలంటేనే మందు, చిందు. చుక్కా, ముక్కా లేకుండా సెలబ్రేషన్స్ చేసుకునేవారు తక్కువే. పార్టీకి హాజరైనా కొంతమంది అలవాటులేక, ఆరోగ్యకారణాల రీత్యా మద్యానికి దూరంగా ఉంటూ వేడుకల్లో పూర్తిగా పాలుపంచుకోలేక నెర్వస్‌గా ఫీలవుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ డ్రింక్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు అన్ని మెట్రోపాలిటన్ సిటీల్లో జరిగే పార్టీల్లో ట్రెండ్ అవుతున్నాయి.
ప్రపంచంలో ఉన్న ఒకే ఒక 10 స్టార్ హోటల్ బుర్జ్ అల్ అరబ్. దుబాయ్‌లో ఉన్న ఈ హోటల్ ప్రత్యేకతలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
84వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)కు ఏర్పాట్లు పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. జనవరి 3 నుంచి ఫిబ్రవరి 15 వరకూ జరగనున్న నుమాయిష్‌లో ఈసారి మరిన్ని ప్రత్యేకతలు ఉండబోతున్నాయి..
కొత్త సంవత్సరం థీమ్‌తో రీల్స్ చేయాలనే తాపత్రయంలో ఓ వ్యక్తి రోడ్డుపై పెట్రోల్‌ను 2024 అంకెల రూపంలో పోసి నిప్పంటించారు. వీడియో వైరల్ కావడంతో సదరు వ్యక్తిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.
హిందీ చిత్రపరిశ్రమలో మొట్టమొదటి సూపర్‌స్టార్‌గా ఓ వెలుగు వెలిగారు రాజేష్‌ఖన్నా. ఆకర్షించే అందం, అద్భుత అభినయంతో పాటు వ్యక్తిగత వివాదాలతోనూ ఎప్పుడూ లైమ్‌లైట్‌లో ఉండేవాడు. చనిపోయి 12 ఏళ్లు గడుస్తున్నా.. వ్యక్తిగత జీవితం, ఆస్తి తగాదాలతో మళ్లీ బీటౌన్‌లో చర్చనీయాంశంగా మారింది రాజేష్‌ఖన్నా పేరు. పుష్కర కాలం గడిచాక రాజేష్‌ఖన్నా లివింగ్ పార్ట్నర్, నటి అనితా అద్వానీ..
హెచ్-1బీ వీసా అమెరికాకు ఎంతో అవసరమని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. దీన్ని పరిరక్షించేందుకు తాను యుద్ధానికైనా సిద్ధమని తేల్చి చెప్పారు.