Share News

Talking Crow: వామ్మో.. ఈ కాకి ఏంటి..అచ్చు మనిషిలా మాట్లాడేస్తోంది!

ABN , Publish Date - Apr 06 , 2025 | 10:29 PM

మహారాష్ట్రలో ఓ పెంపుడు కాకి అచ్చం మనుషుల్లా మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. నమ్మశక్యం కానీ ఈ వీడియోను చూసి జనాలు షాకైపోతున్నారు. తాము కాకికి ఏమీ నేర్పించకుండానే అది తమను అనుకరించడం ప్రారంభించిందని దాన్ని పెంచుకుంటున్న కుటుంబం తెలిపింది.

Talking Crow: వామ్మో.. ఈ కాకి ఏంటి..అచ్చు మనిషిలా మాట్లాడేస్తోంది!
Talking Crow in Maharashtra

ఇంటర్నెట్ డెస్క్: చిలుకలు మనుషులను అనుకరించడం మనం చూస్తూనే ఉంటాం. ఇలా చేయగలిగిన పక్షి ఇదొక్కటే అని అనుకుంటాం. కానీ ఓ కాకి కూడా మనుషులు మట్లాడుతున్నట్టే శబ్దాలు చేస్తూ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలో ఈ ఉదంతం వెలుగు చూసింది (Talking Crow in Maharashtra).

పాల్‌గఢ్‌లోని ఓ గ్రామంలో ఉండే మహిళకు కొంత కాలం క్రితం గాయపడ్డ ఓ కాకి పిల్ల కనిపించింది. దాన్ని ఆ మహిళ ఇంటికి తీసుకొచ్చి జాగ్రత్తగా గాయాలకు మందు రాసింది. జాగ్రత్తగా చూసుకుంది. దీంతో, క్రమంగా కోలుకున్న కాకి ఇంట్లో వ్యక్తులందరికీ అలవాటు పడిపోయింది. అందరి మీద కూర్చుని వారు చెప్పినది జాగ్రత్తగా వినడం ప్రారంభించింది. వారి మాటలకు అలవాటు పడిపోవడమే కాకుండా కుటుంబసభ్యులు ఒకర్ని మరొకరు ఏమని పిలుచుకుంటున్నారో కూడా గుర్తు పట్టి అర్థం చేసుకుంది. అటుపై వారిని అనుకరించడం ప్రారంభించింది. మూడేళ్ల కల్లా దానికి మనుషులన్ని అనుకరించే సామర్థ్యం వచ్చేసింది.


అమ్మ, నాన్న.. ఏం చేస్తున్నావు వంటి పదాలను మరాఠీలో అంటూ ఇంట్లో వారినే కాకుండా చుట్టుపక్కల వారిని కూడా ఆశ్చర్యపరచడం ప్రారంభించింది. ఇలా మనుషుల్లా మాట్లాడుతున్న కాకి వీడియో నెట్టింట కూడా కాలుపెట్టి తెగ వైరల్ అయిపోయింది. గత కొన్ని రోజులుగా ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. దీంతో, కాకిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల వారు కూడా రావడం ప్రారంభించారు.


ఇక తమ కాకి కేవలం మనుషులను అనుకరించడమే కాకుండా ఆశ్చర్యం గొలిపే అనేక పనులు చేస్తుందని కూడా కాకిని పెంచుతున్న ఇంటివారు చెప్పుకొచ్చారు. కొత్తవారు ఎవరైనా తమ ఇంటికి వస్తే ఏ పనిమీద వచ్చారని కూడా అడుగుతుందని అన్నారు. తాము ఇంట్లో వారిని పిలిస్తే కాకి కూడా వారిని అలాగే పిలుస్తుందని అన్నారు. అప్పుడప్పుడూ ఇతర కాకులతో కలిసి వెళ్లిపోయినా సాయంత్రానికల్లా ఇంటికి తిరిగొస్తుందని కూడా తెలిపారు. దాని నివాసం ఎక్కడో బాగా తెలుసునని కూడా అన్నారు. తాము దానికి ఏమీ నేర్పించలేదని, తమను చూసి అదే అన్నీ నేర్చుకుందని కూడా తెలిపారు. నమ్మశక్యం గానీ ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది. మరి మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి:

పెట్రోల్ బంక్ పెట్టుకుంటే ఏటా రూ.40 లక్షల ఆదాయం.. నెట్టింట పోస్టు వైరల్

మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను తిరిగి పొందాలని.. ఆమె తండ్రి అస్థికలు దొంగిలించి..

ఇతరులను టచ్ చేస్తే షాక్.. కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా

Read Latest and Viral News

Updated Date - Apr 06 , 2025 | 10:35 PM