Home » TS News
జనాల్లో ఆశ చావనంత వరకూ నేరగాళ్లు పెరుగుతూనే ఉంటారు. బోగస్ సంస్థలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అధిక వడ్డీల పేరు చెప్పగానే ఇంకేంముందని ఉన్నదంతా ఊడ్చి మరీ పెట్టుబడి పెట్టారు.
మావోయిస్ట్ అగ్రనేత, మొదటి తరం నాయకుడు మాచర్ల ఏసోబ్ అలియాస్ జగన్ అలియాస్ దాదా రణదేవ్ మృతి చెందినట్టుగా పోలీస్ వర్గాల సమాచారం. కేంద్ర కమిటీ సభ్యుడు, సెంట్రల్ ఆర్మీ ఇంచార్జ్‌గా, మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ఇంఛార్జ్‌గా ఉన్న ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆయన హనుమకొండ జిల్లా టేకులగూడెం వాసి అని ఛత్తీస్గడ్ పోలీస్ అధికారులు చెబుతున్నట్టు సమాచారం.
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్, నేలకొండపల్లి మండలాల్లోని వరద ప్రాంతాల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. అతి భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయన్నారు.
వర్షాల ధాటికి రెండు తెలుగు రాష్ట్రాలు విపరీతంగా నష్టపోయాయి. పలు ప్రాంతాల్లో ప్రజలకు నిలువ నీడ కూడా లేకుండా పోయింది. ప్రభుత్వాలు ఎంత సహాయం అందిస్తున్నా కూడా నష్టం తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో పూర్తి స్థాయిలో సాయం అందించలేకపోతున్నాయి.
భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు మంగళవారం పర్యటించారు. బాధిత ప్రజలు, రైతులను ఆదుకుంటామని ధైర్యం చెప్పారు. పంట నష్టం అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
చరిత్రలో ఎన్నడూ కనివిని ఎరుగన్నంత ఉపద్రవం సంభవించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఖమ్మంలో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. ఆపదలో ఉన్న తెలంగాణ ప్రజలను ఆదుకుంటామని.. ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు.
సైబరాబాద్‌లో ఇవాళ, 6వ తేదీ, 9వ తేదీన ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. కాబట్టి అటు వైపునకు వెళ్లాలనుకునేవారు అలర్ట్‌గా ఉండటం మేలు. హైదరాబాద్ నగరంలోని జీఎంసీ బాలయోగి స్టేడియం మరో అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నీకి ఆతిథ్యమివ్వబోతోంది.
కనివినీ ఎరుగని రీతిలో గత రెండు రోజులుగా వర్షాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు వర్షాలకు అతలాకుతలం అవవుతున్నాయి. జనజీవనం స్తంభించింది. కాలనీలకు కాలనీలే వరద నీటిలో చిక్కుకుపోతున్నాయి.
హైడ్రా బుల్డోజర్ చెరువుల్లో నిర్మాణాలు జరిపిన వారి నుంచి అనుమతులు ఇచ్చిన వారి పైకి మళ్లిన విషయం తెలిసిందే. అసలు చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరనేది ఆరా తీసి మరీ 50 మందికి పైగా అధికారులను లిస్ట్ అవుట్ చేయడం జరిగింది.
హైడ్రాతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామాకు తెరలేపిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. నాగోల్ శుభమ్ కన్వెన్షన్‌లో బీజేపీ సభ్యత్వ నమోదుపై వర్క్ షాప్ జరిగింది.