Share News

CM Revanth Reddy: పండగ పూట సన్నబియ్యం

ABN , Publish Date - Mar 30 , 2025 | 01:11 AM

రేషన్‌కార్డులు కలిగిన పేదలకు ఉచితంగా సన్నబియ్యం ఇచ్చే పథకం ఉగాది పండుగ రోజు శ్రీకారం చుట్టుకోనుంది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ ఇందుకు వేదిక కానుంది.

CM Revanth Reddy: పండగ పూట సన్నబియ్యం

  • నేడు హుజూర్‌నగర్‌లో ప్రారంభించనున్న సీఎం

  • 50 వేల మందితో సభ.. ఏర్పాట్లను పరిశీలించిన ఉత్తమ్‌

  • ఏప్రిల్‌ నుంచి 3.10 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ

నల్లగొండ/హుజూర్‌నగర్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రేషన్‌కార్డులు కలిగిన పేదలకు ఉచితంగా సన్నబియ్యం ఇచ్చే పథకం ఉగాది పండుగ రోజు శ్రీకారం చుట్టుకోనుంది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ ఇందుకు వేదిక కానుంది. ఆదివారం సాయంత్రం ఇక్కడ నిర్వహించే సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకోసం పట్టణంలోని వై-జంక్షన్‌ నుంచి రామస్వామిగుట్టకు వెళ్లే దారిలో సన్నబియ్యం ప్రారంభోత్సవ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సభకు హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాల నుంచి సుమారు 50 వేల మందిని తరలించేలా సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌ నుంచి మంత్రి ఉత్తమ్‌తో కలిసి హెలికాప్టర్‌లో హుజూర్‌నగర్‌లోని రామస్వామిగుట్ట వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ వద్దకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో మంత్రితో కలిసి నిర్మాణంలో ఉన్న మోడల్‌కాలనీలోని 2,150 సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పనులను పరిశీలిస్తారు. అనంతరం నేరుగా సభావేదిక వద్దకు చేరుకొని సన్నబియ్యం పథకాన్ని ప్రారంభిస్తారు.


అనంతరం సభను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి తదితరులు ప్రసంగిస్తారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన హుజూర్‌నగర్‌, పాలకవీడు, నేరేడుచర్ల, కోదాడలో సన్నబియ్యం పథకం ప్రారంభోత్సవ సభకు సన్నాహక సమావేశాలు నిర్వహించారు. సభావేదిక నిర్మిస్తున్న ప్రాంతాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. సన్నబియ్యం పథకం కోసం వానాకాలం సీజన్‌లో సైతం సన్నధాన్యానికి కనీస మద్దతు ధరకు తోడు అదనంగా రూ.500 బోనస్‌ ఇచ్చి కొనుగోలు చేశామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 89.73 లక్షల రేషన్‌కార్డులు ఉండగా, 2.80 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు. వీరితో పాటు కొత్తగా రేషన్‌కార్డుల కోసం మరో 30 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయని, వీటన్నింటికీ కలిపి ఏప్రిల్‌ నుంచి 3.10 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. మంత్రి వెంట మల్టీజోన్‌-2 ఐజీ సత్యనారాయణ, సూర్యాపేట కలెక్టర్‌ తేజ్‌సనందలాల్‌ పవార్‌, ఎస్పీ నరసింహ ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Hyderabad Metro : అదిరిపోయే శుభవార్త చెప్పిన HYD మెట్రో.. రైళ్ల ప్రయాణ వేళలు పొడిగింపు..

GPO Posts: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 30 , 2025 | 01:11 AM