Minister Uttam: పేదలకు గుడ్‌న్యూస్.. సన్నబియ్యం పంపిణీపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ABN , Publish Date - Mar 29 , 2025 | 06:08 PM
Minister Uttam Kumar Reddy: .సన్నబియ్యం పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెల్ల రేషన్ కార్డ్ దారులకు మూడు రంగుల కార్డ్... ఉన్నతులకు గ్రీన్ కార్డ్ అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

సూర్యాపేట : సన్నబియ్యం పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా రేపటి నుంచి ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సహా మొత్తం కేబినెట్, ఎంపీలు హాజరు కాబోతున్నారని తెలిపారు. ప్రతి కార్యకర్త కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాలని చెప్పారు. ఇవాళ(శనివారం) మెల్లచెరువు, చింతలపాలెం, మఠంపల్లి, మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెల్ల రేషన్ కార్డ్ దారులకు మూడు రంగుల కార్డ్... ఉన్నతులకు గ్రీన్ కార్డ్ అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని అన్నారు. రాష్ట్రంలో 84శాతం జనాభాకు మేలు చేసే కార్యక్రమం చేపట్టబోతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
సాగులో ఉన్న ప్రతి ఎకరాకు రైతు భరోసా: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం: ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సన్నబియ్యం పంపిణీ చేపట్టిన సీఎం రేవంత్‌రెడ్డికు ధన్యవాదాలు తెలిపారు. సాగులో ఉన్న ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తామని స్పష్టం చేశారు. నిర్లక్ష్యానికి గురైన సీతారామ ప్రాజెక్ట్ రైతాంగానికి సాగునీరు ఇచ్చేలా సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. సాగర్ ఆయకట్టు స్థిరీకరణకు రాజీవ్ కెనాల్‌కు అడగ్గానే నిధులు మంజూరు చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
భద్రాద్రి రామాలయం విస్తరణ పనులకు రూ.34 కోట్లు మంజూరు చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. మైన్స్ ఇంజినీరింగ్ కాలేజ్‌ను ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డికు ప్రతిపాదన చేశామని గుర్తుచేశారు. రెండు, మూడు రోజుల్లో యూనివర్సిటీ జీవో వస్తుందని స్పష్టం చేశారు. కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు కేంద్రంతో సంప్రదింపులు జరిపామని అన్నారు. ఉగాది పర్వదినాన వేంసూరు మండలం కల్లూరు గూడెంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు. ఆయిల్ పామ్ హబ్‌గా తెలంగాణ మారనుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Mallareddy controversy: మరోసారి మల్లారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్.. ఏకంగా హీరోయిన్‌పై..
Betting App Case: బెట్టింగ్ కేసు.. నేడు మరోసారి పోలీస్ స్టేషన్‌కు విష్ణుప్రియ
Phone Tapping Case: పోలీసుల ముందు శ్రవణ్ రావు.. అడిగిన ప్రశ్నలివే..
Read Latest Telangana News and Telugu News