Home » Uttar Pradesh
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని సుల్తాన్పూర్ కోర్టు మంగళవారం ఉత్తరప్రదేశ్ పోలీసులను ఆదేశించింది. ఆగస్ట్ 28వ తేదీ జరిగే విచారణకు ఆయన్ని హాజరు పరచాలని పోలీసులకు కోర్టు సూచించింది. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ కోర్టులో దాదాపు 23 ఏళ్ల క్రితం నాటి కేసు విచారణలో వాయిదాల పర్వం కొనసాగుతుంది.
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్స్పై వైద్యుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి.. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదం జరిగింది. బస్సు, వ్యాను ఢీకొనడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
విమానాశ్రయంలో రేడియా ధార్మిక పదార్ధాల గుర్తింపు ఉత్తరప్రదేశ్‌లో కలకలం సృష్టించింది. లక్నోలోని చౌధరి చరణ్‌సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్-3 కార్గో ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం రొటీన్ తనిఖీల సమయంలో రేడియా ధార్మిక పదార్ధాలను అధికారులు గుర్తించారు.
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది యువకులు తెలిసి తెలిసి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. వ్యూస్, లైక్‌ల కోసం వినూత్నంగా రీల్స్ చేయాలని ప్రయత్నిస్తూ చివరకు ఊహించని ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
ఆగస్టు నెలలో రుతుపవనాలు చురుగ్గా ఉన్న క్రమంలో వర్షాలు(rains) విస్తారంగా కురుస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ చుట్టుపక్కల నగరాల్లో నిన్న జోరు వాన కురిసింది. ఈ క్రమంలో ఢిల్లీలో నేడు, రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సహా 17 రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచనలు జారీ చేసింది. వాటిలో ఏయే రాష్ట్రాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జన్యుపర లోపాలతో స్త్రీ, పురుషుల్లో మార్పులు సంభవిస్తుంటాయి. అవి కొన్నేళ్లకు బయట పడుతుంటాయి. ఉత్తరప్రదేశ్‌లో కూడా ఓ పురుషుడికి ఇలానే బయట పడింది. రాజ్ గిరి మిస్త్రీ (46)కి పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవల అతను కడుపునొప్పితో ఇబ్బంది పడ్డాడు. పలు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నాడు. అయినా ఫలితం లేదు.
అయోధ్యలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో కీలక నిందితుడు, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ మాజీ ప్రతినిధి నవాబ్ సింగ్ యూదవ్ను ఉత్తరప్రదేశ్ పోలీసులు కన్నౌజ్‌లో సోమవారంనాడు అరెస్టు చేశారు. అఖిలేష్ యాదవ్‌కు కూడా నవాబ్ సన్నిహితుడని తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. గర్భవతికి ఆపరేషన్ చేసిన వైద్యులు ఆమె కడుపులో టవల్‌ను వదిలిపెట్టారు. ఇంటికొచ్చాక ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమెను మరో ఆసుపత్రిలో చేర్పించగా జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది.
లంచంగా ఓ సబ్ ఇన్స్పెక్టర్ బంగాళదుంపలు డిమాండ్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చర్చనీయాంశం(Viral News) అవుతోంది. కానీ ఈ కేసులో బిగ్ ట్విస్ట్ పోలీసులను నివ్వెరపరిచింది.