Share News

Mahakumbh: మమత 'మృత్యుకుంభ్' వ్యాఖ్యలను సమర్ధించిన శంకరాచార్య

ABN , Publish Date - Feb 19 , 2025 | 09:42 PM

మహాకుంభ్ నిర్వాహకులు సరైన క్రౌడ్ మేనేజిమెంట్ ప్రక్రియను పాటించలేదని అవిముక్వేశర్వానంద్ సరస్వతి విమర్శించారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలకు సమర్ధనగా ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు.

Mahakumbh: మమత 'మృత్యుకుంభ్' వ్యాఖ్యలను సమర్ధించిన శంకరాచార్య

న్యూఢిల్లీ: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న 'మహాకుంభ్' (Mahakumbh)ను 'మృత్యు‌కుంభ్'గా సంబోధిస్తూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఓవైపు దుమారం రేపుతుండగా, తాజాగా మమత వ్యాఖ్యలకు ఉత్తరాఖండ్‌లోని జ్యోతిష్‌పీఠం 46వ శంకరాచార్య (Shankaracharya) స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి (Avimukteshwaranand Saraswati) మద్దతుగా నిలిచారు.

Anti Corruption: అవినీతిని అరికట్టేందుకు కీలక చర్యలు.. 52 మంది అధికారుల సస్పెండ్


మహాకుంభ్ నిర్వాహకులు సరైన క్రౌడ్ మేనేజిమెంట్ ప్రక్రియను పాటించలేదని అవిముక్వేశర్వానంద్ సరస్వతి విమర్శించారు. ''300 కిలోమీటర్ల వరకూ ట్రాఫిక్ జామ్‌లు ఉన్నాయి. భక్తులు తమ లగేజీలతో 25 నుంచి 30 కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది. స్నానం చేసే నీటిలో మురుగునీరు కలుస్తోంది. స్నానానికి ఆ జలాలు మంచివి కావని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయినప్పటికీ కోట్లాది మంది ప్రజలను బలవంతంగా అదే నీటిలో స్నానాలు చేయిస్తున్నారు'' అని అన్నారు.


''మీరు చేయాల్సి పని ఏమిటి? కొద్ది రోజుల క్రితమే డ్రెయిన్స్‌ను నిలిపివేయడం కానీ మళ్లించడం కానీ చేయాలి. అప్పుడే జనం స్వచ్ఛమైన జలాల్లో స్నానం చేయగలుగుతారు. 12 ఏళ్లకు మహాకుంభ్ వస్తుందని పన్నెండేళ్ల క్రితమే మీకు తెలుసు. అయినా ఆ దిశగా మీరు ఎందుకు చర్యలు చేపట్టేలేదు" అని పరోక్షంగా యూపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. పెద్దసంఖ్యలో జనం వస్తారని, తగినంత స్థలం లేదని తెలిసినప్పుడు అందుకు తగిన ప్లాన్ ఉండాలని, అలాంటి ప్లాన్ లోపించిందని అన్నారు. 144 ఏళ్లకు ఒకసారి ఈ పర్వదినం వస్తుందన్న ప్రచారం పూర్తిగా అబద్ధమని, క్రౌడ్ మేనేజ్‌మెంట్ పాటించలేదని, ప్రజలు చనిపోయినా దానిని దాచిపట్టే ప్రయత్నం చేశారని, ఇది చాలా పెద్ద నేరమని అన్నారు.


ఇవి కూడా చదవండి..

Rekha Gupta: మోదీకి కృతజ్ఞతలు: రేఖా గుప్తా తొలి స్పందన

Delhi CM Oath: ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి కేజ్రీవాల్, అతిషి హాజరవుతారా?

PM Kisan: రైతులకు అలర్ట్.. ఫిబ్రవరి 24లోపు ఈ పని చేయండి.. లేదంటే..

Ayodhya Ram Temple: ఆ వేడుక వల్ల అయోధ్య రామమందిరం పనులకు బ్రేక్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 20 , 2025 | 12:31 AM