Home » Vijayasai Reddy
సొంత చెల్లి, కన్న తల్లిపై జగన్‌కు కనికరం లేదని, కుటుంబానికంటే ఆస్తులకే జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది. జగన్‌లో అంత మంచితనమే ఉంటే సొంత చెల్లి, తల్లి ఎందుకు అసహించుకుంటారనేది పెద్ద ప్రశ్న. 2019 ఎన్నికల ముందు తల్లిని, చెల్లిని..
జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోకూడదని షర్మిల భావిస్తున్నారని, ఎవరు ముఖ్యమంత్రి అయినా పర్లేదు.. కానీ జగన్ మళ్ళీ సీఎం కావొద్దని షర్మిల కంకణం కట్టుకున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. శత్రవులకు మేలు చేయటం కోసం.. సొంత అన్నకు అన్యాయం చేసే వాళ్ళని ఎవర్నీ చూడలేదన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోవడానికి కారకులు ఎవరో గుండెపై చేయి వేసుకుని షర్మిల చెప్పాలన్నారు.
విజయసాయిరెడ్డి కుమార్తె నెహారెడ్డి భీమిలి బీచ్ వద్ద సీఆర్‌జడ్ ప్రాంతంలో సముద్రానికి అతి సమీపంలో శాశ్వత కాంక్రిట్ నిర్మాణం చేపడుతున్నా.. అధికారులు పట్టించుకోవడంలేదని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. అన్ని వివరాలతో నివేదిక సమర్పించాలని జీవీఎంసీకి ఆదేశం..
తిరుపతి లడ్డూ వివాదంపై దేశ వ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్న వేళ.. నిజాలు నిగ్గు తేల్చుందుకు సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. నిజాయితీ గల అధికారులకు ఆ కమిటీలో చోటు కల్పించింది. దీంతో తమ తప్పులు ఎక్కడ బయటకు వస్తాయోననే ఆందోళనతోనే వైసీపీ నేతలు సిట్‌పై ఆరోపణలు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నేతలను 151స్థానాల నుంచి 11సీట్లకు ప్రజలు పరిమితం చేసినా వారికి సిగ్గు రావడం లేదని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు. విజయసాయిరెడ్డితోపాటు దేవినేని అవినాశ్, కొడాలి నాని, పేర్ని నాని వంటి నేతల్ని ఏ పార్టీలో చేర్చుకోరని ఆయన ఎద్దేవా చేశారు.
Andhrapradesh: చీటెడ్ అకౌంటెంట్‌గా పేరుగాంచిన జైలుపక్షి విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని టీడీపీ నేత శ్రీనివాసరావు హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెడ్డి హయాంలో పనిచేసిన ఎక్కువ మంది ఉన్నతాధికారులు, నాయకులు జైలు భయంతో సముద్రమార్గం, విమానయానం ద్వారా ఖండాతరాలు దాటి పారిపోతున్నారన్నారు.
విశాఖ జిల్లా భీమిలి బీచ్ సమీపంలో సీఆర్‌జడ్ నిబంధనలు ఉల్లంఘించి వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె పెనక నేహారెడ్డి నిర్మించిన ప్రహరీ గోడ కూల్చివేతపై హైకోర్టులో విచారణ జరిగింది.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి జీవీఎంసీ షాక్ ఇచ్చింది. నేహారెడ్డి చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు జేసీబీలు ఆ ప్రాంతానికి చేరుకుని కూల్చివేతలను ప్రారంభించాయి.
మీడియా సంస్ధల అధినేతలు, జర్నలిస్టులను కించపరచేలా వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై జర్నలిస్టు, ప్రజాసంఘాలు, పలు పార్టీలు ధ్వజమెత్తాయి.
Andhrapradesh: మీడియాపై రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. విజయసాయిరెడ్డిపై జర్నలిస్టులు, మీడియాతో పాటు టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ... గత ఐదు సంవత్సరాలు మీడియా గొంతు నొక్కాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.