Share News

Grandi Srinivas: విజయసాయి రాజీనామాపై గ్రంధి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 25 , 2025 | 09:19 PM

Grandi Srinivas: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ కోసం కష్టపడ్డ ఏ ఒక్కరినీ మీరు అధికారంలో ఉండగా గుర్తించలేదని విమర్శించారు. విజయ సాయి చుట్టూ ప్రదక్షిణలు చేసిన వారినే కోటరీగా చేసుకుని పార్టీని ముంచేశారని గ్రంధి శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు.

Grandi Srinivas: విజయసాయి రాజీనామాపై గ్రంధి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
Grandi Srinivas

పశ్చిమ గోదావరి: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. విజయసాయి నిర్ణయంపై రాజకీయ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక రాజకీయాల్లో ఉండను, వ్యవసాయం చేసుకుంటానన్న విజయసాయి రెడ్డికి గ్రంధి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు.


వారు కూడా రాజీనామా చేయాలి..

‘‘మీరొక్కరే కాదు, వైసీపీలో మిగిలిన మీ కోటరీ అందరూ రాజీనామా చేయండి. అందరూ కలిసి వ్యవసాయం చేసుకుంటేనే లాభసాటిగా ఉంటుంది. వైసీపీను 151 సీట్ల నుంచి 11 సీట్లకు దిగజార్చిన ఘనత మీది, మీ కోటరీ నాయకుడిది. మీతో పాటు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మండలి చైర్మన్ మోషేన్ రాజు, మాజీ ప్రభుత్వ విప్ ముదునూరి ప్రసాదరాజు మిగిలిన మీ నేతలందరినీ మీతో తీసుకుపోండి. పార్టీ కోసం కష్టపడ్డ ఏ ఒక్కరినీ మీరు అధికారంలో ఉండగా గుర్తించలేదు. మీ చుట్టూ ప్రదక్షిణలు చేసిన వారినే కోటరీగా చేసుకుని పార్టీని ముంచేశారు. మీరు, మీ కోటరీ చేసిన కార్యక్రమాలు, బయటకు వస్తున్న అవినీతి, అక్రమాలకు సమాధానం చెప్పే బాధ్యత మీకుంది. అవన్నీ తప్పించుకునేందుకు తెలివిగా రాజకీయ సన్యాసం, వ్యవసాయం అని చెబుతున్నారు’’ అని గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి

YS Sharmila: విజయసాయి ఇప్పటికైనా నిజాలు బయటపెట్టు.. షర్మిల చురకలు

విజయసాయి రాజకీయ సన్యాసంపై చంద్రబాబు ఏమన్నారంటే

వివేకానందరెడ్డికి గుండెపోటని ఎందుకు చెప్పానంటే

కూటమి కోసం రాజీనామా.. అసలు విషయం బయటపెట్టిన..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jan 25 , 2025 | 09:23 PM