High Drama: యలమంచిలి మండల పరిషత్ కార్యాలయంలో హై డ్రామా
ABN , Publish Date - Mar 28 , 2025 | 02:05 PM
యలమంచిలిలో ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. టీడీపీ కూటమి, వైసీపీ ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి.. ఎన్నికల ప్రక్రియ రసాభాసగా మారింది. ఈ క్రమంలో ఎన్నికల ప్రొసీడింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ అస్వస్థతకు గురయి.. స్పృహ కోల్పోయి పడిపోయారు.

విశాఖ జిల్లా: యలమంచిలి (Yalamanchili) మండల పరిషత్ కార్యాలయంలో హై డ్రామా (High Drama) చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఎంపీపీ ఎన్నిక (MPP election) వాయిదా (Postponed) పడింది. టీడీపీ కూటమి (TDP Kutami) ఎంపీటీసీ (MPTC)లు భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ వైసీపీ ఎంపీటీసీ (YCP MPTC)లు ఆరోపించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి.. ఎన్నికల ప్రక్రియ రసాభాసగా మారింది. ఈ క్రమంలో ఎన్నికల ప్రొసీడింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ అస్వస్థతకు గురయి.. స్పృహ కోల్పోయి పడిపోయారు. దీంతో అధికారులు మెడికల్ సిబ్బందిని లోపలికి పంపించారు. ప్రశాంత వాతావరణం నెలకొనే వరకు ఎన్నిక వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు.
Also Read..: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
కాగా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. దగదర్తి మండలంలో ఎంపీటీసీలు వైసీపీకి ఎదురుతిరిగారు. మండల ఉపాధ్యక్ష ఎన్నికకు రెండవ రోజు శుక్రవారం కూడా డుమ్మా కొట్టారు. మాజీ మంత్రి కాకాణి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి సూచనలు బేఖాతరు చేశారు. దీంతో కాకాణి, రామిరెడ్డికి ఘోరపరాభవం జరిగింది. రేపోమాపో ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరాలని వైసీపీ ఎంపీటీసీలు నిర్ణయించారు. దీంతో నెల్లూరు జిల్లాలో కావలి రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి.
వరుసగా వైసీపీకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. నెల్లూరు జిల్లా, జగదర్తి ఎంపీపీ ఎన్నిక శుక్రవారం జరగనుంది. ఉన్న 10 మంది ఎంపీటీసీ (MPTC)లో 9 మంది వైసీపీకి ఎదురు తిరగడంతో కోరం లేక గురువారం జరగాల్సిన ఎన్నిక శుక్రవారం నాటికి వాయిదా పడింది. అయితే ఎన్నికకు హాజరుకాకుండా ఎంపీటీసీలు ఈరోజు కూడా డుమ్మా కొట్టారు. మాజీ మంత్రి కాకాణీ, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిని ఎంపీటీసీలు లెక్కచేయడంలేదు. వైసీపీలో ఉండలేమని తెగేసి చెప్పేసారు. త్వరలోనే ఎమ్మెల్యే కావ్య కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీటీసీలు టీడీపీలో చేరనున్నారు.
మరోవైపు వైసీపీ హయాంలో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి ఓ వెలుగు వెలుగొందారు. అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు ఒక రేంజ్‌లో రెచ్చిపోయారు. ఎప్పటికీ అధికారం తమదే అన్న ధీమాతో వారు అందినకాడికి దోచుకున్నారు. కూటమి ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో వారెవరికీ నిద్ర కూడా పట్టడం లేదు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆయన అనుచరులకు ఇప్పుడు ఫోర్జరీ ఉచ్చు బిగుస్తోంది. జగన్ జమానాలో పెద్ద ఎత్తున గ్రావెల్ దందా. కాకాణి అండతో గ్రావెల్ మాఫియా రెచ్చిపోయింది.
అక్రమ తవ్వకాలు..
సర్వేపల్లి రిజర్వాయర్‌తో సహా చెరువుల్లో పెద్ద ఎత్తున గ్రావెల్ అక్రమ తవ్వకాలు చేపట్టి రూ.వందల కోట్లలో స్వాహా చేశారు. అలాగే ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతకం ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాగుంట పేరుతోనూ అక్రమ అనుమతులు తీసుకోవడంతో అప్పట్లోనే కాకాణి అనుచరులపై కేసులు నమోదయ్యాయి. మాగుంట సంతకాల ఫోర్జరీ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఇప్పటికే పదిమంది అధికారులతో సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పర్యవేక్షణాధికారిగా బాపట్ల ఎస్పీ, పరిశోధనాధికారిగా బాపట్ల డీఎస్పీ రెండు రోజులుగా ముమ్మర విచారణ జరుపుతున్నారు. గ్రావెల్ అక్రమాలపై పెద్ద ఎత్తున పోరాటం చేసిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. టీడీపీ నేతలపై కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టించారనే ఆరోపణలు ఉన్నాయి.
భారీ కుంభకోణం..
వైసీపీ హయాంలో జరిగిన భారీ కుంభకోణం బయటపడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఫోకస్ పెట్టింది. బాధితులు కూడా పెద్దఎత్తున ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి భారీ భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కాకాణి అక్రమ భాగోతాలు బయటకు వస్తున్నాయి. రూ.230కోట్ల విలువ చేసే పేదల భూములను తన అల్లుడు కంపెనీకి అప్పనంగ దోచిపెట్టినట్లు కాకాణిపై ఆరోపణలు వచ్చాయి. రామదాసుకండ్రిగ ప్రాంతంలో పోర్టు రోడ్డుకు ఆనుకుని ఉన్న భూములను కాజేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కాకాణి భూ కుంభకోణాలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ విషయంపై విచారణ జరిపించి, న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విశాఖలో జర్నలిస్టునంటూ వ్యక్త హల్ చల్
భర్తపై అలిగి భార్య ఆత్మహత్యాయత్నం..
టీడీపీలోకి వైసీపీ కీలక నేతలు..
For More AP News and Telugu News