సీసీసీలోని జనావాసాల మధ్య ఉన్న డంప్‌యార్డును అక్కడి నుంచి తరలించాలని సింగరేణి ఉద్యోగులు ఏరియా జీఎం ఎం. శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ సుర్మిళ్ల వేణుకు మంగళవారం వినతిపత్రం ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ, సింగరేణి ఉద్యోగుల క్వా ర్లర్ట మధ్యలోని ముక్కిడి పోచమ్మ ఆలయం వెనుకవైపు డంప్‌యార్డు ఉండడంతో తీవ్ర దుర్గంధం వస్తోం దని, తరచుగా చెత్తను తగులబెట్టడంతో పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని తెలిపారు.
ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఇలాంటి తరుణంలో మట్టి పనులు చేయటం ఉపాధిహామీ కూలీలకు కష్టసాధ్యమే.
జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు విద్యార్థులకు అసౌక ర్యం కలగకుండా చూడాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పీటీజీ బాలుర కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి పరీక్ష తీరును పరిశీలించారు.
విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన కీచక ఉపాధాయ్యుడికి నిర్మల్ జిల్లా పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. నిందితుడుని అరెస్టు చేసి జైలుకు తరలించారు.
ప్రభుత్వ భూములకు అక్రమ పట్టాలు పుట్టుకొచ్చిన ఘటన ఇటీవల దండేపల్లి మండలం అదుగుల పేటలో వెలుగు చూసింది. సర్కారు భూములను అక్రమంగా కట్టబెట్టిన అధికారులు వాటికి లావుణి పట్టాలు జారీ చేశారు. పైగా అసైన్మెంట్ కమిటీ ప్రమేయం లేకుండానే నేరుగా మండల రెవెన్యూ అధికారులు పట్టాలు జారీ చేయడం గమనార్హం.
మండలంలోని గ్రామ్లా లో ఉపాధిహామీ పనులు లేవని ఏవరూ చెప్పకూడదని ఎంపీడీ వో సరోజ సిబ్బందిని ఆదేశించారు. పట్టణంలోని ఎంపీడీవో మీటింగ్ మాలులో బుధవారం ఉపాదిహామీ సిబ్బందితోపాటు పంచాయతీ సెక్రెటరీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఇంటర్ ఐపీఈ థియరీ ఎగ్జామ్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. బుధవారం జనరల్ విద్యార్థులు 6,597 విద్యార్థులు కాగా 6,372 మంది హాజరుకాగా 225 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
ఉన్నత విద్యకు మార్గం వేసే ఇంటర్ పరీక్షలు సమీపించాయి. బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలు నిఘా నీడన జరగనున్నాయి.
గౌతమ బుద్ధుడు చూపిన శాంతి మార్గంలో నడిచి ప్రశాంత జీవనం గడపాలని ఆల్ ఇండియా భిక్కు సంఘం ప్రధాన కార్య దర్శి భదంతే ధమ్మ సారథి సూచించారు.
రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటేందుకు నాయకులు, కార్యకర్తలు పాటుపడాలని ఎమ్మెల్సీ దండె విఠల్ సూచించారు.