పాడిపరిశ్రమ అభివృద్ధే ధ్యేయం
ABN , First Publish Date - 2020-12-23T06:49:47+05:30 IST
గ్రామీణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమ అభివృద్ధే ధ్యేయంగా కృష్ణా మిల్క్ యూనియన్ పనిచేస్తోందని అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు అన్నారు.

పామర్రు, డిసెంబరు 22 : గ్రామీణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమ అభివృద్ధే ధ్యేయంగా కృష్ణా మిల్క్ యూనియన్ పనిచేస్తోందని అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు అన్నారు. పామర్రు పాలశీతలీకరణ కేంద్రంలో పాడి రైతులకు మంగళవారం బోనస్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పశుపోషకులను మరింత ప్రోత్సహించేందుకు లాభాన్ని సైతం పంచుతున్న ఘనత కృష్ణామిల్క్ యూనియన్‌దేనన్నారు. ఏడాదిలో 180 రోజులు క్రమ తప్పకుండా పాలుపోసిన సంఘ సభ్యులకు ఆడపిల్లల పెళ్లి సమయంలో సుమంగిళి పథకం కింద రూ.20 వేల గోల్డ్‌కాయిన్ అందిస్తున్నామన్నారు. పాడిరైతులకు రూ.1.80 కోట్ల బోనస్ చెక్కును అందజేశారు. జిల్లాడైరక్టర్లు వేమూరి వెంకట సాయిబాబు, పులి మల్లిఖార్జునరావు, సంస్థ మేనేజంగ్ డైరక్టర్ కొల్లి ఈశ్వర్‌బాబు, డీజీఎం అనిల్‌కుమార్, పామర్రు మేనేజర్ దామోదర కృష్ణగోపినాథ్, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.