భక్తిశ్రద్ధలతో కార్తీక మాసోత్సవాలు
ABN , First Publish Date - 2020-11-29T05:32:43+05:30 IST
భక్తిశ్రద్ధలతో కార్తీక మాసోత్సవాలు

కీసర రూరల్: నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఆలయాల్లో కార్తీకమాసోత్సవ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ప్రధానంగా నాగారంలో భవాని నాగలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తిమండలి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. శనివారం త్రయోదశి కావడంతో ఆలయంలో రుద్ర హోమంతో పాటు స్వామి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సోమవారం పౌర్ణమి వస్తుడంటంతో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చైర్మన్ ప్రతా్‌పరెడ్డి తెలిపారు.