డ్యాంమిట్..!
ABN , First Publish Date - 2021-07-06T05:05:49+05:30 IST
డ్యాంమిట్..!

తెలంగాణలో కట్టలేరుపై నిబంధనలకు విరుద్ధంగా చెక్‌డ్యామ్ నిర్మాణం
ఆంధ్రాకు ఆగిపోయిన నీరు
ఎక్కువ ఎత్తులో డ్యామ్ నిర్మించడం వల్లే..
మన జిల్లాలో 5వేల ఎకరాలకు అందని నీరు
వీరులపాడు, జూలై 5 : తెలంగాణ శివారు ప్రాంతమైన తొండల గోపవరం వద్ద కట్టలేరుపై నిర్మించిన చెక్‌డ్యామ్ కారణంగా దిగువ ప్రాంతానికి నీటి ప్రవాహం ఆగిపోయింది. దీంతో ఆంధ్రా ప్రాంతంలోని వీరులపాడు మండలం జయంతి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనలకు లోబడి చెక్‌డ్యామ్ నిర్మించాల్సి ఉన్నప్పటికీ, అందుకు భిన్నంగా ఎక్కువ ఎత్తులో డ్యామ్ నిర్మించడం వల్ల ఖరీఫ్ ప్రారంభంలో దిగువకు చుక్కనీరు రావట్లేదు. దీంతో గ్రామానికి చెందిన రైతు నాయకుడు విప్పల కృష్ణారెడ్డి తన సొంత నిధులు రూ.లక్షా50వేలతో కట్టలేరుపై నీటి నిల్వ కోసం ఆనకట్ట నిర్మించారు. అయితే, దొడ్డదేవరపాడు, జయంతి, వీరులపాడు, చౌటపల్లి, చట్టన్నవరం, పెద్దాపురంలో సుమారు 5వేల ఎకరాల్లోని రైతుల సౌకర్యార్థం జయంతి లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద చెక్‌డ్యామ్ నిర్మాణం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. వచ్చే ఏడాది నాటికీ చెక్‌డ్యామ్ నిర్మిస్తే తప్ప తమ లిఫ్ట్‌కు నీరందే పరిస్థితి లేదని వాపోతున్నారు. దీని నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని రైతులు కోరుతున్నారు.
