కమనీయం వేంకటేశ్వరుని కల్యాణం
ABN , First Publish Date - 2021-02-23T05:19:01+05:30 IST
మార్కాపురం పట్టణ శివార్లలో వెలసియున్న శ్రీలక్ష్మీపద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి కల్యాణం కమనీయంగా జరిగింది.

మార్కాపురం (వన్‌టౌన్) ఫిబ్రవరి 22 : మార్కాపురం పట్టణ శివార్లలో వెలసియున్న శ్రీలక్ష్మీపద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి కల్యాణం కమనీయంగా జరిగింది. 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రధాన అర్చకులు ఏవీకే నరసింహాచారుల ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరుని ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కళ్యాణ ఘట్టాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కల్యాణం తిలకించిన భక్తులు పులకరించిపోయారు. స్వామి తరుపున ఒక్కలగడ్డ రాధిక మల్లికార్జున్, లక్ష్మీదేవి తరపున వెంకటరాంబాబు, పద్మావతి తరుపున పాదర్తి వెంకటరమణయ్య ఉభయదాతలుగా పాల్గొన్నారు. కల్యాణ ఉభయదాతలుగా స్వామి తరుపున గిద్దలూరి ఎమ్మెల్యే అన్నా రాంబాబు లక్ష్మీదేవి తరుపున బొగ్గరపు చెంచు వెంకటసుబ్బయ్య కుటుంబ సభ్యులు, పద్మావతి అమ్మవారి తరుపున యక్కలి కాశీవిశ్వనాథం, ఆలయ అధ్యక్షుడు చెక్కా మాలకొండ నరసింహారావు పట్టు వస్త్రాలు సమర్పించారు. ముత్యాల తలంబ్రాలు అచుత పెదవెంకటేశ్వర్లు సమర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయంత్రం శ్రీవారికి గరడు వాహన సేవ నిర్వహించారు.