కాళ్ల పీహెచ్‌సీలో వైద్యురాలి తీరుపై విచారణ

ABN , First Publish Date - 2021-04-10T05:15:45+05:30 IST

కాళ్ళ పీహె చ్‌సీ డాక్టర్‌ పి.రమామహేశ్వరిపై డీఎంహెచ్‌వో కార్యాలయ పరిపాలనాధికారి డాక్టర్‌ బాలప్రకాష్‌ శుక్రవారం విచారణ జరిపారు.

కాళ్ల పీహెచ్‌సీలో వైద్యురాలి తీరుపై విచారణ
కాళ్లలో విచారణ జరుపుతున్న డీఎంహెచ్‌వో కార్యాలయ అధికారి

కాళ్ళ,  ఏప్రిల్‌ 9 :  కాళ్ళ పీహె చ్‌సీ డాక్టర్‌ పి.రమామహేశ్వరిపై డీఎంహెచ్‌వో కార్యాలయ పరిపాలనాధికారి డాక్టర్‌ బాలప్రకాష్‌ శుక్రవారం విచారణ జరిపారు. డాక్టర్‌ రమామహేశ్వరి ఉద్దేశ్యపూర్వకంగా విధులు కేటాయించడంతో పాటు మానసికంగా హింసిస్తున్నారని హెల్త్‌ అసిస్టెంట్‌  యోహాన్‌ డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేశారన్నారు. అంతే కాకుండా ప్రభుత్వాసుపత్రిలో జీతం తీసుకుంటూ భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నారని ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. వైద్యాధికారిణి, ఫిర్యాదుదారుడు, పలువురు సిబ్బందిని విచారించామన్నారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు. ఆయన వెంట డాక్టర్‌ గులాబ్‌ రాజ్‌కుమార్‌ ఉన్నారు. 

Updated Date - 2021-04-10T05:15:45+05:30 IST