‘పబ్ జీ’... మళ్ళీ వస్తోందా ?

ABN , First Publish Date - 2021-03-11T22:43:31+05:30 IST

కిందటేడాది సెప్టెంబరులో కేంద్రం నిషేధానికి గురైన పబ్‌జీ గేమ్... మళ్ళీ రాబోతోందా ?

‘పబ్ జీ’... మళ్ళీ వస్తోందా ?

న్యూఢిల్లీ : కిందటేడాది సెప్టెంబరులో కేంద్రం నిషేధానికి గురైన పబ్‌జీ గేమ్... మళ్ళీ రాబోతోందా ? చైనాతో వివాదాలు, హింసను ఆ దేశం ప్రేరేపిస్తోందన్న కారణంతో కేంద్ర ప్రభుత్వం ఈ గేమ్‌ను గతేడాది నిషేధించిన విషయం తెలిసిందే. పబ్ జీ(ప్లేయర్స్ అన్ నోన్ బ్యాటిల్ గ్రౌండ్) ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమాన గణాన్ని సంపాదించుకుంది. కోట్ల మంది పబ్ జీని ఆడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ గేమ్‌ను ఆదరించిన తొలి మూడు దేశాలో భారత్ కూడా ఒకటి. 


ఇటీవల పబ్ జీ మొబైల్ గ్లోబల్ అప్‌డేట్ వెర్షన్ 1.3 ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో... హిందీ వెర్షన్‌కు సపోర్ట్ చేసే సోర్స్ కూడా ఉంది. అలాగే `పబ్‌జీ మొబైల్ ఇండియా` అధికారిక వెబ్‌సైట్, సోషల్ మీడియా ఖాతాల్లో'కమింగ్ సూన్' అనే ట్యాగ్‌ కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో పబ్ జీ పునరాగమనం ఉంటుందని భారత్‌లోని పబ్ జీ ఆటగాళ్ళు భావిస్తున్నారు. చైనాకు చెందిన టెన్సెంట్ సంస్థ... పబ్ జీ నుంచి ఇప్పటికే వైదొలగిన విషయం తెలిసిందే. `పబ్జీ మొబైల్ ఇండియా` ప్రీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా గతంలో ప్రారంభమైంది. అయితే కేంద్రం నుంచి మాత్రం సానుకూల సంకేతాలు లేవు. 

Updated Date - 2021-03-11T22:43:31+05:30 IST

News Hub