‘ఇంటింటా ఇన్నోవేటర్‌’ పోస్టర్‌ ఆవిష్కరణ

ABN , First Publish Date - 2021-07-21T06:07:22+05:30 IST

జిల్లాలోని ఔత్సాహికులు తమ ప్రతిభను చాటుకునేందుకు ఇంటింటా ఇన్నోవేటర్‌ కార్య క్రమం చక్కని వేదికగా నిలుస్తోందని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ అన్నారు.

‘ఇంటింటా ఇన్నోవేటర్‌’ పోస్టర్‌ ఆవిష్కరణ
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ, ఇతర అధికారులు

పెద్దపల్లి కల్చరల్‌, జూలై 20 : జిల్లాలోని ఔత్సాహికులు తమ ప్రతిభను చాటుకునేందుకు ఇంటింటా ఇన్నోవేటర్‌ కార్య క్రమం చక్కని వేదికగా నిలుస్తోందని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు మంగళవారం సాయం త్రం కలెక్టరేట్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ వారు రూపొందించిన పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇన్నోవేషన్‌, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి ప్రభుత్వం మూడేళ్లుగా ఆన్‌లైన్‌లో ఆవిష్కరణల ప్రదర్శనను నిర్వహిస్తు న్నట్లు తెలిపారు. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా జిల్లా స్థా యిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉంటుందని, కరోనా నేపథ్యంలో ఈసారి కూడా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారన్నా రు. జిల్లా నుంచి 2019లో పది, 2020లో మూడు ప్రదర్శనలు ఉత్తమంగా నిలిచాయని తెలిపారు. ఎగ్జిబిషన్‌ను ఆన్‌లైన్‌ లిం క్‌ ద్వారా ప్రజలు ఆవిష్కరణలను చూడవచ్చన్నారు. ఈ ప్రద ర్శనలో అన్ని రంగాల, వర్గాల ఆవిష్కరణలు ప్రొత్సహిస్తారన్నా రు. గ్రామీణ ఆవిష్కరణ, విద్యార్థుల ఆవిష్కరణ, ప్రారంభ ఆ విష్కరణలు, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల్లో ఆవిష్కరణలు త దితర వాటిని అంగీకరిస్తారన్నారు. ఆవిష్కరణకు సంబంధించి న ఆరు వాక్యాలు, రెండు నిమిషాల వీడియోను ఆవిష్కరణ యొక్క నాలుగు ఫొటోలు, ఆవిష్కర్త పేరు, ఫోన్‌ నెంబర్‌, వ యసు, ప్రస్తుత వృత్తి, గ్రామంపేరు, మండలం పేరు తదితర వివరాలను 9100678543కి వాట్సాప్‌ చేయాలన్నారు. ఇన్నోవేట ర్స్‌ నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి చివరి తేదీ 25 జులై అని, వివరాలకు జిల్లా సమన్వయకర్త బి.రవినందన్‌రావును 9951504622 ఫోన్‌నంబర్‌లో సంప్రదించాలని కలెక్టర్‌ తెలి పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, సైన్స్‌ అధికారి రవినందన్‌రావు, వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ ప్రమోద్‌కుమార్‌, డాక్టర్‌ వాసుదేవారెడ్డి, సమగ్ర శిక్ష కోఆర్డినే టర్‌ విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-21T06:07:22+05:30 IST