స్వతంత్ర సేనాని సుభాష్ చంద్రబోస్
ABN , First Publish Date - 2021-01-24T03:33:49+05:30 IST
నేతాజీగా పేరు గాంచిన గొప్ప స్వాతంత్య్ర సేనాని సుభాష్ చంద్రబోస్ అని జిల్లా అదనపు కలెక్టర్ హనుమంత్ రెడ్డి అన్నారు.

- అదనపు కలెక్టర్ హనుమంత్ రెడ్డి
బిజినేపల్లి, జనవరి 23: నేతాజీగా పేరు గాంచిన గొప్ప స్వాతంత్య్ర సేనాని సుభాష్ చంద్రబోస్ అని జిల్లా అదనపు కలెక్టర్ హనుమంత్ రెడ్డి అన్నారు. మండల కేంద్రం బిజినేపల్లి, పాలెంలో శనివారం స్టార్ నేతాజీ యువజన సంఘం, యువజన సంఘాల సేవా సమితి, సేవా ఫౌండేషన్, లైన్స్‌క్లబ్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీల ఆధ్వర్యంలో నేతాజీ జయంతి పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరం విజయవం తంగా నిర్వహించారు. రక్తదానం చేసిన యువతకు రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ధృవపత్రాలను అందజేసి అభినందించారు. ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, లైన్స్‌క్లబ్ అధ్యక్షురాలు ఇందుమతి, కార్యదర్శి రాధా, జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ కార్యదర్శి రమేష్‌రెడ్డి, యూత్ వింగ్ కుమార్, బ్లడ్ బ్యాంక్ డాక్టర్ రోహిత్, యువజన సంఘాల సభ్యుల జహంగీర్, బా నూరి కిరణ్, శ్రీనివాసులు, రమణ, దామోదర్, కిషోర్, నాగరాజుగౌడ్, రాము, వెంకటేష్, బిజినేపల్లిలో బత్తుల రాములు, శివరాజు, నసీర్, ఈశ్వర్, వెంకటేష్, రామచంద్రయ్య, కృష్ణయ్య, రఘు తదితరులు ఉన్నారు.
- శనీశ్వరాలయంలో జేసీ ప్రత్యేక పూజలు
నంది వడ్డెమాన్‌లోని జేష్టదేవి సమేత శనీశ్వర స్వామి ఆలయంలో, పాలెం వెంకన్న ఆలయంలో అదనపు కలెక్టర్ హనుమంతురెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. కాకతీయుల కాలంనాటి పురాతన ఆలయం విశిష్టతను పూ జారులను అడిగి తెలుసుకున్నారు.