రాజశ్యామల యాగానికి సీఎం జగన్‌ను ఆహ్వానించిన విశాఖ శారదాపీఠం
ABN , First Publish Date - 2022-12-15T19:42:41+05:30 IST
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి (Swatmanandendra Saraswati Swami) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి (Jagan)ని కలిశారు.
తాడేపల్లి: విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి (Swatmanandendra Saraswati Swami) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి (Jagan)ని కలిశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేశారు. జనవరి 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఐదు రోజులపాటు విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు జరగనున్నాయని సీఎంకు తెలిపారు. వార్షికోత్సవాల సందర్భంగా రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నామని చెప్పారు. యాగంలో రాజశ్యామల అమ్మవారి మూల మంత్రాలతో లక్ష సార్లు హవనం జరుగుతుందని వివరించారు. ఉత్సవాలలో పాల్గొని రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు పొందాలని సీఎంకు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి సూచించారు. స్వాత్మానందేంద్ర స్వామి వెంట ముఖ్యమంత్రిని కలిసిన వారిలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు.