జొన్నవాడ ఆలయంలో హుండీల లెక్కింపు

ABN , First Publish Date - 2022-09-23T04:34:01+05:30 IST

మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలో గురువారం హుండీల లెక్కింపు జరిగింది.

జొన్నవాడ ఆలయంలో హుండీల లెక్కింపు
జొన్నవాడ ఆలయంలో హుండీల లెక్కింపులో పాల్గొన్న అధికారులు, భక్తులు.

66 రోజులకు రూ.36 లక్షల రాబడి

బుచ్చిరెడ్డిపాళెం, సెప్టెంబరు 22: మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలో గురువారం హుండీల లెక్కింపు జరిగింది. హుండీలల్లో భక్తులకు సమర్పించుకున్న కానుకల ద్వారా 66 రోజులకుగాను రూ. 36లక్షలా 17వేల 111 మేర ఆలయానికి ఆదాయం  వచ్చి నట్టు ఆలయ చైర్మన్‌ పుట్టా సుబ్రహ్మణ్యంనాయుడు, ఏసీ, ఈవో  డబ్బుగుంట వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే హుండీల ద్వారా భక్తులు 60.500 గ్రాముల బంగారు ఆభరణాలు, 340.500 గ్రాముల వెండి ఆభరణాలను సమర్పించినట్టు వారు తెలిపారు. కామాక్షితాయి అన్నదాన సదనంలోని హుండీ ద్వారా రూ.లక్షా 5వేల 612 ఆదాయం వచ్చినట్టు తెలిపారు. లెక్కింపులో జిల్లా దేవదాయశాఖ ఏసీ పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఆశా ఖ కోవూరు డివిజన్‌ ఇన్స్‌పెక్టర్‌ ఎం. సుధీర్‌ పాలకమండలి సభ్యులు రఘురామయ్య, శివకుమార్‌, శశిశేఖర్‌శర్మ, స్థానిక బ్యాంకు అధికారులు శివకుమార్‌, అలీ, అప్రైజర్‌ ఎన్‌బీ. సింగ్‌, ఆలయ సిబ్బంది, పోలీసులు, విద్యాసాగర్‌,  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విశ్రాంత ఉద్యోగులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-23T04:34:01+05:30 IST

News Hub