Share News

Keerthi Suresh : ఐస్‌క్రీం అమ్మే వ్యక్తిని అల్లాడించిన మహానటి.. ఫన్నీ వీడియో వైరల్..

ABN , Publish Date - Mar 21 , 2025 | 02:48 PM

Keerthi Suresh : సోషల్ మీడియా ద్వారా నిత్యం అభిమానులకు టచ్‌లో ఉండే మహానటి కీర్తి సురేష్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్(Instagram) అకౌంట్లో ఓ వీడియో షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు కీర్తి సురేష్‌ తెలివితేటలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Keerthi Suresh : ఐస్‌క్రీం అమ్మే వ్యక్తిని అల్లాడించిన మహానటి.. ఫన్నీ వీడియో వైరల్..
Keerthy Suresh Viral Video

Keerthi Suresh Viral Video : తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్ వరస సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో అప్‌డేట్స్ ఇస్తూ సందడి చేస్తుంటుంది మహానటి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ వీడియో షేర్ చేసింది. పోస్ట్ చేసిన క్షణం నుంచే ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఐస్ క్రీం వెండర్‌‌ను ఎత్తుకు పై ఎత్తు వేసి ఈ బ్యూటీ చేసిన హంగామాకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బ్యూటీ విత్ బ్రెయిన్ అని పొగిడేస్తూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..


నిత్యం సోషల్ మీడియా(social Media)లో యాక్టీవ్‌గా ఉండే ఈ బ్యూటీ కీర్తి సురేష్ ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ వీడియో షేర్ చేసింది. ‘జస్ట్ ఫర్ ఫన్’ అనే క్యాప్షన్ జోడించి పోస్ట్ చేసిన ఈ వీడియో కొద్దిసేపటికే నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఏముందంటే, సాధారణంగా ఐస్ క్రీమ్ తినేందుకు వెళ్లిప్పుడు టర్కిష్‌ ఐస్‌క్రీమ్‌ అమ్మే బాయ్స్ కామెడీ చేస్తుంటారు. ఇది కొందరికి సరదాగా అనిపిస్తే మరికొందరికి చికాకు తెప్పిస్తుంది. అలాంటి చోటికే ఐస్ క్రీం తినేందుకు వెళ్లింది కీర్తి సురేష్. అలవాటు ప్రకారం ఐస్ అమ్మే బాయ్ డైరెక్ట్‌గా కీర్తి చేతికి ఐస్ క్రీం ఇవ్వకుండా కాసేపు ఓ ఆట ఆడుకున్నాడు. తర్వాత కీర్తి సురేష్ కూడా అదే స్టైల్లో ఐస్ క్రీం వెండర్‌ చేతికి డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి లాగేసుకుంటూ చుక్కలు చూపించింది.


‘బేబీ జాన్‌’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ వరస సినిమాలతో బిజిగా ఉన్నారు. ‘రివాల్వర్‌ రీటా’,‘కన్నివేడి’ చిత్రాలతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న మహానటి ఇటీవల చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తటిల్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే.


Read Also : Tattoo: నాటి పచ్చబొట్టు.. నేటి టాటూ

Newly Weds fall into Canal: ఇందుకే మనసును కంట్రోల్ చేసుకోవాలనేది.. ఈ కొత్త జంట పరిస్థితి ఏమైందో చూస్తే

Iceberg Flips Over: భయానక దృశ్యం.. సముద్రంలో తేలుతున్న మంచు ఫలకంపై ఎక్కితే

Updated Date - Mar 21 , 2025 | 03:50 PM