Jobs: నెలకు లక్షా 20 వేల జీతం..518 బ్యాంకు పోస్టులకు నేడే లాస్ట్ ఛాన్స్..
ABN , Publish Date - Mar 21 , 2025 | 02:55 PM
మీరు బ్యాంకింగ్ రంగంలో కొలవుల కోసం చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలో 518 ఖాళీలకు అప్లై చేసేందుకు ఈరోజు చివరి ఛాన్స్. మీకు ఆసక్తి ఉంటే వెంటనే అప్లై చేయండి మరి.

దేశంలోని ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రస్తుతం వివిధ విభాగాల్లో ఉద్యోగులను నియమించేందుకు 518 ఖాళీలను ప్రకటించింది. ఈ నియామకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు, మార్చి 21, 2025తో ముగియనుంది. అయితే మీకు ఆసక్తి ఉండి ఇంకా అప్లై చేయకపోతే, ఇప్పుడే చేసేయండి మరి. ఈ నియామకం కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా అనేక విభాగాలలో ప్రత్యేక నిపుణుల్ని నియమించేందుకు 518 పోస్టులకు నోటిఫికేషన్ ప్రకటించింది. ఈ పోస్టులలో అత్యధికం ఐటి, రిస్క్ మేనేజ్‌మెంట్, ట్రేడ్ & ఫారెక్స్, సెక్యూరిటీ విభాగాలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసేందుకు కొన్ని తప్పనిసరి నియమాలు పాటించాలి.
ముందుగా బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ bankofbaroda.inను సందర్శించండి
ఆ తర్వాత హోమ్‌పేజీలోని కెరీర్ లింక్‌పై క్లిక్ చేయండి
తర్వాత హోమ్‌పేజీలో ఉన్న ‘కెరీర్’ లింక్‌పై క్లిక్ చేసి, ప్రొఫెషనల్ రిక్రూట్‌మెంట్ సంబంధిత వివరాలను తెలుసుకోండి
అప్లై ఆన్‌లైన్ లింక్ పై క్లిక్ చేయండి
మీరు ‘ప్రొఫెషనల్స్’ లింక్ గుర్తించగానే దాన్ని క్లిక్ చేసి, ఆన్‌లైన్ దరఖాస్తు ఫారంను ప్రారంభించండి
ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసి మీ ఖాతా సృష్టించుకోండి
ఫారమ్ నింపి, ఫీజు చెల్లించుకోండి
ఖాతాలోకి లాగిన్ అయి, అవసరమైన వివరాలతో ఫారమ్ నింపండి. తరువాత, రుసుము చెల్లించి సమర్పించండి
దరఖాస్తు ప్రక్రియ పూర్తైన తర్వాత భవిష్యత్తు అవసరాల కోసం ఆ పేజీ సేవ్ చేసుకోండి
వేతనం ఎలా ఉంటుంది..
జూనియర్ మేనేజ్‌మెంట్ స్కేల్ (స్కేల్-I): ఈ స్థాయిలో నియమించునే అభ్యర్థులకు నెలకు రూ. 48,480 నుంచి రూ.85,920 వరకు జీతం లభిస్తుంది
సీనియర్ మేనేజ్‌మెంట్ స్కేల్ (స్కేల్-V): ఈ స్థాయి ఉద్యోగాలు పొందే అభ్యర్థులకు నెలకు రూ. 1,20,940 నుంచి రూ. 1,35,020 వరకు జీతం వస్తుంది.
అర్హత ప్రమాణాలు
బ్యాంక్ ఆఫ్ బరోడా SO రిక్రూట్‌మెంట్ 2025కి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అందుకు సంబంధించిన అర్హత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. విద్యార్హత విషయంలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే పోస్టుల ఆధారంగా మారుతుంది. అర్హత ప్రమాణాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి అభ్యర్థులు అధికారిక లింక్ (https://www.bankofbaroda.in/career/current-opportunities) క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
ఫీజు వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
జనరల్, EWS, OBC అభ్యర్థులకు రూ. 600
SC, ST, PWD, మహిళా అభ్యర్థులకు రూ. 100
ఈ రుసుము ఆన్‌లైన్ విధానంలో మాత్రమే చెల్లించవచ్చు. దీంతోపాటు ఇది తిరిగి చెల్లించబడదు. అందువల్ల, దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఈ విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
ఎంపిక విధానం
మొదట ఆన్‌లైన్ పరీక్ష: అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా పరీక్షలకు హాజరవుతారు. పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులే తదుపరి దశలోకి వెళతారు.
సైకోమెట్రిక్ పరీక్ష: ఎంపిక ప్రక్రియలో సైకోమెట్రిక్ పరీక్షను కూడా నిర్వహించవచ్చు
గ్రూప్ డిస్కషన్: కొంతమంది అభ్యర్థులు గ్రూప్ డిస్కషన్ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుంది.
ఇంటర్వ్యూ: చివరిగా అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు
ఇవి కూడా చదవండి:
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News