తడిసి ముద్దయిన నెల్లూరు

ABN , First Publish Date - 2022-12-25T23:47:39+05:30 IST

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుం డం కారణంగా ఆదివారం నగరంలో పలుమార్లు వర్షం కురిసింది.

తడిసి ముద్దయిన నెల్లూరు
నగరంలో వర్షంలో పాదచారులు

నెల్లూరు(సిటీ), డిసెంబరు 25 : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుం డం కారణంగా ఆదివారం నగరంలో పలుమార్లు వర్షం కురిసింది. విడతల వారీగా ఓ మోస్తరు జల్లులు పడటంతో నగరం తడిసి ముద్దయింది. ఆదివారం, పైగా క్రిస్మస్‌ పండుగ కావడంతో నగరంలోకి పెద్ద ఎత్తున వాహనాలు, ప్రజలు రావడంతో రద్దీ నెలకొంది. అయితే వర్షంతో ప్రధాన రహదారులు, కూడళ్లు, అండర్‌ బ్రిడ్జీల వద్ద నీళ్లు నిలవడంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

నగరంలో అత్యధికంగా పడారుపల్లిలో 13 మి.మీ. వర్షపాతం నమోదవగా, గాంఽధీనగర్‌లో 11.25 మి.మీ., పెద్దచెరుకూరులో 11, కరంటాఫీసు కూడలిలో 8.75, కొత్తకాలువ వద్ద 8, మాగుంటలేఅవుట్‌లో 5.75, సౌత్‌మోపూరులో 5, డ్రైవర్స్‌కాలనీలో 2, దేవరపాళెంలో 2, మున్సిపల్‌ కార్యాలయం వద్ద 1 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు గణాంక శాఖ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. జిల్లాలోని కొడవలూరు, విడవలూరు మండలాల్లో అత్యధికంగా వర్షం కురిసినట్లు అధికారుల సమాచారం. మిగిలిన మండలాల్లోనూ ఓ మోస్తారు వర్షం పడింది. ఈ వర్షం వరి పంటకు పెద్దగా నష్టం చేకూర్చకపోగా పత్తి సాగుకు మాత్రం నష్టాన్ని కలగచేసినట్లు రైతులు వాపోతున్నారు.

Updated Date - 2022-12-25T23:47:42+05:30 IST

News Hub