అమ్మో నిమ్మ..! డజను రూ. 100
ABN , First Publish Date - 2022-04-25T05:04:02+05:30 IST
వేసవి తాపాన్ని తీర్చేవాటిలో ముందు వరుసలో ఉండే నిమ్మ ధర ఎండలతోపాటు మండిపోతోంది. పదిరోజుల నుంచి పైపైకి వెళ్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో డజను నిమ్మ కాయులు రూ.100 పలుకుతున్నాయి.

వేసవి తాపాన్ని తీర్చేవాటిలో ముందు వరుసలో ఉండే నిమ్మ ధర ఎండలతోపాటు మండిపోతోంది. పదిరోజుల నుంచి పైపైకి వెళ్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో డజను నిమ్మ కాయులు రూ.100 పలుకుతున్నాయి. ఒక కాయను రూ.10కి అమ్ముతున్నారు. ఈ ఏడాది జిల్లాలో నిమ్మ కాపు ఆశాజనకంగా లేకపోవడం, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడం ధర పెరగడానికి కారణమని వ్యాపారులు చెప్తున్నారు. నిమ్మకాయల ఆధారంగా వేసవి ఉపాధిని ఎంచుకునే వీధి వ్యాపారులు డీలా పడిపోతున్నారు. మామూలుగా రూ.10కి విక్రయించే గ్లాసు నిమ్మకాయ షోడా ధరను ప్రస్తుతం రూ.15కు పెంచేశారు. దాహార్తిని తీర్చేందు వాడే మజ్జిగలో, హోటల్స్‌లో టిఫిన్‌లో ఇచ్చే నిమ్మబద్ధ ఇప్పుడు కనిపించడం లేదు.
- ఒంగోలు (కార్పొరేషన్)