ఘనంగా లక్ష తులసి అర్చన

ABN , First Publish Date - 2022-11-05T23:20:50+05:30 IST

అబ్బాయిపేట శ్రీమురళీకృష్ణ ఆలయ ప్రాంగణంలో శనివారం లక్ష తులసి పూజ వైభవంగా నిర్వహించారు. కార్తీక శుద్ధ ద్వాదశి పర్వదినం పురస్కరించుకొని భక్తులు, భాగవతులు స్వామికి లక్ష తులసి అర్చన చేశారు.

ఘనంగా లక్ష తులసి అర్చన
లక్ష తులసి పూజలో పాల్గొన్న భక్తులు భాగవతులు

జలుమూరు: అబ్బాయిపేట శ్రీమురళీకృష్ణ ఆలయ ప్రాంగణంలో శనివారం లక్ష తులసి పూజ వైభవంగా నిర్వహించారు. కార్తీక శుద్ధ ద్వాదశి పర్వదినం పురస్కరించుకొని భక్తులు, భాగవతులు స్వామికి లక్ష తులసి అర్చన చేశారు. లోక కల్యాణార్థం ప్రతీ ఏటా లక్షార్చన నిర్వహిస్తున్నట్లు భాగవతులు తెలిపారు. ఆలయ అర్చకులు దివాకర్‌స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిం చారు. మధ్యాహ్నం భక్తులకు అన్నసంతర్పణ చేశారు.

Updated Date - 2022-11-05T23:20:52+05:30 IST