నక్షత్రాలు - సౌర కుటుంబం గురించి వివరణ..
ABN , First Publish Date - 2022-10-10T21:20:38+05:30 IST
ఏ సమయంలో వస్తువుకు అతి తక్కువ పొడవు నీడ ఏర్పడుతుందో ఆ సమయాన్ని ఆ ప్రదేశం ‘ప్రాంతీయ మధ్యాహ్నవేళ’ అంటారు. సూర్యుడు రోజురోజుకి దక్షిణ దిక్కుగా కదులుతున్నట్లు
ఏ సమయంలో వస్తువుకు అతి తక్కువ పొడవు నీడ ఏర్పడుతుందో ఆ సమయాన్ని ఆ ప్రదేశం ‘ప్రాంతీయ మధ్యాహ్నవేళ’ అంటారు. సూర్యుడు రోజురోజుకి దక్షిణ దిక్కుగా కదులుతున్నట్లు అనిపిస్తే దానిని ‘దక్షిణాయణం’ అంటారు. ఉత్తర దిక్కుగా కదులుతున్నట్లు అనిపిస్తే దానిని ‘ఉత్తరాయణం’ అంటారు.
నీడ గడియారం: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో గల అన్నవరం సత్యన్నారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో నీడ గడియారం ఉంది.
- తెలంగాణలోని మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌లు 180 ఉత్తర అక్షాంశ డిగ్రీల వద్ద ఉన్నాయి.
- రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండ 170 ఉత్తర అక్షాంశ డిగ్రీల వద్ద ఉన్నాయి.
- చంద్రుని ఆకారం ప్రతిరోజూ మారుతుంటుంది. చంద్రుని ఆకారంలో మార్పునే ‘చంద్ర కళలు’ అంటారు. చంద్రుని శాస్త్రీయ నామం- లూనా సెలెనె.
- అమావాస్య రోజును ‘0’ లేదా ‘28’వ రోజు అంటారు.
- సూర్యగ్రహణం: చంద్రుని నీడ భూమిపై పడితే దానిని సూర్యగ్రహణం అంటారు.
సూర్యగ్రహణాలు నాలుగు రకాలు
1) సంపూర్ణ సూర్యగ్రహణం 2) పాక్షిక సూర్యగ్రహణం
3) వలయాకార సూర్యగ్రహణం 4) మిశ్రమ సూర్యగ్రహణం
చంద్రగ్రహణం: భూమి నీడ చంద్రునిపై పడితే దానిని చంద్రగ్రహణం అంటారు.
చంద్రగ్రహణం మూడురకాలు
1) సంపూర్ణ చంద్రగ్రహణం 2) పాక్షిక చంద్రగ్రహణం
3) ప్రచాయ/ ఉపచాయ చంద్రగ్రహణం
నక్షత్ర రాశులు
మనుషులు, జంతువుల ఆకారాలను పోలిన నక్షత్రాల చిన్న చిన్న గుంపులను ‘నక్షత్ర రాశులు’ అంటారు.
- లక్షలు, కోట్ల నక్షత్రాలు గల పెద్ద గుంపులను ‘గెలాక్సీ’లు అంటారు.
- ధ్రువ నక్షత్రం స్థానం - సప్తర్షి మండలం
- చలికాలంలో ఇది సూర్యోదయానికి కొద్దిగంటల ముందు ఆకాశంలో ఉదయిస్తుంది. ఇది ఆకాశంలో ఉత్తరం వైపు కనిపిస్తుంది.
శర్మిష్టరాశి
- ఇది కూడా ఆకాశంలో ఉత్తరం వైపునే కనిపిస్తుంది. దీనిలో గల ఆరు నక్షత్రాలు ఇంగ్లీష్ ‘ఎం’ ఆకారాన్ని పోలి ఉంటాయి.
- ఆంధ్రప్రదేశ్ నుంచి ఆకాశంలో చూడటానికి వీలయ్యే నక్షత్రరాశులు 1) సప్తర్షి మండలం 2) శర్మిష్టరాశి 3) ఒరియన్(వేటగాడు రాశి) 4) లియో(సింహరాశి)
- పాలపుంత అనే గెలాక్సీలో సూర్యుడు ఒకానొక నక్షత్రం.
సౌర కుటుంబం
సూర్యుడు: మనకు అతి దగ్గరలో ఉన్న నక్షత్రం సూర్యుడు.
సౌర కుటుంబంలోని గ్రహాలు ఎనిమిది. (ఫ్లూటో మినహా)
సూర్యునికి, అంతరిక్ష వస్తువులకు మధ్యగల గురుత్వాకర్ష బలం వల్ల అవి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నాయి.
గ్రహాలు: ఏ అంతరిక్ష వస్తువైనా మరో దాని చుట్టూ తిరుగుతూ ఉంటే దానిని శాటిటైల్(ఉపగ్రహం) అంటారు.
మానవ నిర్మిత ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి. వీటిని కృత్రిమ ఉపగ్రహాలు అంటారు.
1. బుధుడు
- సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం.
- సౌర కుటుంబంలో అతి చిన్న గ్రహం.
- బుధ గ్రహానికి ఉపగ్రహాలు లేవు.
- పరిభ్రమణ కాలం: 88 రోజులు
2. శుక్రుడు
- గ్రహాలన్నింటిలో భూమికి దగ్గరగా ఉన్న గ్రహం.
- అన్ని గ్రహాల్లో ప్రకాశవంతమైంది.
- దీనికి గల పేర్లు: వేగుచుక్క, సాయంకాల చుక్క
- - ఉపగ్రహాలు లేవు.
- ప్రత్యేకత: తూర్పు నుంచి పడమరకు తిరుగుతుంది.
- భూమి పడమర నుంచి తూర్పునకు తిరుగుతుంది.
- పరిభ్రమణ కాలం: 225 రోజులు
3. భూమి
- గ్రహాలన్నింటిలో జీవాన్ని కలిగి ఉన్న గ్రహం భూమి మాత్రమే.
- భూమి నీలి - ఆకుపచ్చ రంగులో కనిపించడానికి కారణం: భూమిపై ఉన్న నేల, నీటి వల్ల కాంతి పరావర్తనం చెందడం వల్ల.
- భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం: చంద్రుడు. ఫ పరిభ్రమణ కాలం: 365 రోజులు.
4. కుజుడు
- భూ కక్ష్యకు బయటి వైపున ఉన్న గ్రహాల్లో మొదటిది.
- ఇది ఎరుపురంగులో కనపడటంతో ‘అరుణ గ్రహం’ అంటారు.
- ఉపగ్రహాల(చంద్రుడు) సంఖ్య: రెండు
- ఫపరిభ్రమణం కాలం: 687 రోజులు
5. గురుడు/ బృహస్పతి
- సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహం.
- భూ పరిమాణంలో పోలిస్తే 1300 రెట్లు పెద్దది.
- ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశికి 318 రెట్లు.
- ఉపగ్రహాలు: 50.
- పరిభ్రమణ కాలం:12 సంవత్సరాలు.
6. శని
- ఇది పసుపురంగులో కనిపిస్తుంది.
- వలయాలు దీని ప్రత్యేకత. ఫ ఉపగ్రహాలు: 53
- పరిభ్రమణ కాలం: 29.5 సంవత్సరాలు
7. యురేనస్
- శుక్రగ్రహం మాదిరిగా యురేనస్ కూడా తూర్పు నుంచి పడమరకు తిరుగుతుంది.
ప్రత్యేకత: దీని అక్షం అత్యధికంగా వంగి ఉండటం. దీనివల్ల అది తనచుట్టూ తాను తిరగడం అనేది దొర్లుతున్నట్లు కనిపిస్తుంది. ఫ ఉపగ్రహాలు: 27
పరిభ్రమణ కాలం: 84 సంవత్సరాలు
8. నెఫ్ట్యూన్
సౌర కుటుంబంలో సుదూరంగా ఉన్న గ్రహం.
ఉపగ్రహాలు: 13. పరిభ్రమణ కాలం: 165 సంవత్సరాలు
అంతర గ్రహాలు
మొదటి నాలుగు గ్రహాలైన బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు ఇవి సూర్యునికి అతి దగ్గరగా ఉన్నాయి.
బాహ్యగ్రహాలు
అంగారక గ్రహ కక్ష్యకు బయటి వైపున ఉన్న గురుడు, శని, యురేనస్, నెఫ్ట్యూన్‌లను ‘బాహ్య గ్రహాలు’ అంటారు.
సౌర కుటుంబంలోని ఇతర వస్తువులు
- ఆస్టరాయిడ్లు: అంగారక, బృహస్పతి గ్రహ కక్ష్యల మధ్య విశాలమైన ప్రదేశంలో అనేక చిన్న చిన్న శిలలు సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. వీటిని ఆస్టరాయిడ్స్ అంటారు.
- తోకచుక్కలు:ఇవి సూర్యుని చుట్టూ అతి దీర్ఘవృత్త కక్ష్యల్లో పరిభ్రమిస్తుంటాయి.
- తోకచుక్క సూర్యుని సమీపిస్తున్న కొద్దీ దాని తోక పొడవు పెరుగుతుంది. తోక ఎల్లప్పుడూ సూర్యునికి వ్యతిరేక దిశలో ఉంటుంది. హేలి తోకచుక్క 76 ఏళ్లకోసారి కనిపిస్తుంది.
- ఉల్కలు: భూ వాతావరణంలోకి చొరబడే చిన్న వస్తువులు(చుక్క తెగిపడింది అంటారు)
- భారతదేశం మొదటిసారిగా ప్రయోగించిన ఉపగ్రహం- ఆర్యభట్ట
- అమావాస్య రోజు సూర్యుడు, చంద్రుడు భూమికి ఒకే దిశలో ఉంటాయి.
- పౌర్ణమిరోజు సూర్యుడు, చంద్రుడు భూమికి వ్యతిరేక దిశలో ఉంటాయి.
- చంద్రయాన్-1: 2008 అక్టోబరు 22న మన దేశం చంద్రుని గురించి అనేక విషయాలు తెలుసుకోవడానికి చంద్రుని ఉపగ్రహాన్ని ప్రయోగించింది.
- చంద్రునిపై నీటి జాడ తెలుసుకోవడం.
- సౌర వ్యవస్థ ఆవిర్భావానికి సంబంధించిన ఆధారాలను సేకరించడం.
- చంద్రుని అధ్యయనం చేసే శాస్త్రం - సెలెనాలజీ
- చంద్రునిపై పదార్ధ మూలకాలను తెలుసుకోవడం.
- హీలియం-3ను సెర్చ్ చేయడం.
- చంద్రుని 3డి
- (త్రిమితీయ) అట్లాస్‌ను తయారుచేయడం.
- ఇప్పటివరకు చంద్రుని పైకి ఉపగ్రహాలు పంపిన దేశాలు: ఆరు (భారత్‌తో కలిపి)
మార్స్ సైన్స్ లాబొరేటరి
- నాసా 2011 నవంబరు 26న మార్స్ సైన్స్ లాబొరేటరిని ప్రారంభించింది.
- దీనిలో భాగంగా క్యూరియాసిటి అనే ‘రోవర్’ను 2012 ఆగస్టు 6న అంగారకునిపై దింపింది.
ముఖ్యాంశాలు: 1. ఇది అంగారకుని ఉపరితలంలో గల శిలలోని మూలకాలను అధ్యయనం చేస్తుంది.
2. అంగారకునిపై నీటి జాడను కనుగొన్నది.
3. అంగారకునిపై జీవం పుట్టుకకు అనుకూలించే పరిస్థితులు ఉన్నాయో లేదో అధ్యయనం చేస్తుంది.
సూర్యుని నుంచి భూమికి గల దూరం: 15,00,00,000 కి.మీ.
భూమి నుంచి చంద్రునికి గల దూరం: 3,84,399 కి.మీ.
సూర్యుని వ్యాసం: 13,92,000 కి.మీ.
భూమి వ్యాసం: 12,756 కి.మీ.
చంద్రుని వ్యాసం: 3,474 కి.మీ.
మన విశ్వం
1. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం?
ఎ) ధ్రువ నక్షత్రం బి) ఒరియన్
సి) సూర్యుడు డి) శర్మిష్టరాశి జవాబు(సి)
2. అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహం?
ఎ) బుధుడు బి) శని సి) బృహస్పతి డి) కుజుడు జవాబు(బి)
3. సప్తర్షి మండలం అనేది......?
ఎ) గ్రహం బి) గ్రహాల సముదాయం
సి) నక్షత్రం డి)నక్షత్ర రాశులు జవాబు(డి)
4. సౌర కుటుంబంలో లేనిది?
ఎ) ఉల్కలు బి) తోకచుక్క సి) గెలాక్సీ
డి) ఆస్టరాయిడ్స్ జవాబు(సి)
5. సూర్యుని నుంచి సుదూరంగా ఉన్న గ్రహం?
ఎ) వరుణుడు బి) ఇంద్రుడు సి) బృహస్పతి డి) శని జవాబు(బి)
6. ‘ఎం’ లేదా ‘డబ్ల్యూ’ ఆకారంలో గల నక్షత్ర రాశి?
ఎ) సప్తర్షి మండలం బి) శర్మిష్ట రాశి
సి) ఒరియన్ డి) లియో జవాబు(బి)
7. ఒక అమావాస్యకు మరో అమావాస్యకు మధ్యకాలం?
ఎ) 14 రోజులు బి) 15 రోజులు సి) 28 రోజులు డి) 29 రోజులు జవాబు(సి)
8. ఆస్టరాయిడ్స్ ఏ గ్రహ కక్ష్యల మధ్య తిరుగుతుంటాయి?
ఎ) శుక్రుడు, కుజుడు బి) కుజుడు, బృహస్పతి సి) శుక్రుడు, బృహస్పతి
డి) భూమి బృహస్పతి జవాబు(బి)
9. సూర్యుని చుట్టూ పొడవైన దీర్ఘ వృత్తాకార కక్ష్యల్లో తిరిగే అంతరిక్ష వస్తువులను ఏమంటారు?
ఎ) ఉల్కలు బి) ఉల్కాపాతం సి) తోకచుక్కలు డి) ఆస్టరాయిడ్స్ జవాబు(సి)
10. వేగుచుక్క - సాయంకాల చుక్క అని పేరు గల గ్రహం?
ఎ) అరుణ గ్రహం బి) బృహస్పతి సి) శుక్రుడు డి) బుధుడు జవాబు(సి)
-శీలం దేవేందర్‌రెడ్డి
సీనియర్ ఫ్యాకల్టీనక్షత్రాలు - సౌర కుటుంబం గురించి వివరణ..