MCD elctions: కాంగ్రెస్‌కు షాక్.. ఆప్‌లో చేరిన మాజీ ఎంపీ
ABN , First Publish Date - 2022-11-20T13:49:01+05:30 IST
ఎంసీడీ ఎన్నికలకు (MCD elections) ముందు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మహాబల్ మిశ్రా ఆదివారంనాడు..
న్యూఢిల్లీ: ఎంసీడీ ఎన్నికలకు (MCD elections) ముందు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మహాబల్ మిశ్రా (Mahabal Mishra) ఆదివారంనాడు ఆమ్ ఆద్మీ పార్టీలో (AAP) చేరారు. ఆదివారంనాడిక్కడ జరిగిన ఒక పబ్లిక్ ర్యాలీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో ఆయన ఆప్‌లో చేరారు. ఉప ముఖ్మమంత్రి మనీష్ సిసోడియా సైతం హాజరయ్యారు.
మూడుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, ఒకపరి కౌన్సిలర్‌గా ఎన్నికైన మిశ్రా పూర్వాంచల్ కమ్యూనిటీలో పేరున్న నేత. ఆయన కుమారుడు వినయ్ శర్మ ఇప్పటికీ ద్వారక నియోజకవర్గం నుంచి ఆప్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా, ఎంసీడీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ 10 హామీలతో ప్రజల్లోకి వెళ్తోంది. బీజేపీ ఈసారి ఎలాగైనా ఎంసీడీపై పట్టు సాధించాలనే పట్టుదలతో ఉంది. కాంగ్రెస్ పార్టీ సైతం తమ పట్టుచాటాలని అనుకుంటోంది. ఎంసీడీలోని 250 వార్డులకు డిసెంబర్ 4న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 7న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తారు.