BJP: ఢిల్లీ బీజేపీ చీఫ్ అనూహ్య నిర్ణయం..
ABN , First Publish Date - 2022-12-11T16:14:51+05:30 IST
ఎంసీడీ (Delhi Municipal Corporation) ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఢిల్లీ బీజేపీ (BJP) అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా (Adesh Gupta) అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు.
న్యూఢిల్లీ: ఎంసీడీ (Delhi Municipal Corporation) ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఢిల్లీ బీజేపీ (BJP) అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా (Adesh Gupta) అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. ఆదేశ్ గుప్తా రాజీనామాకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) ఆమోదం తెలిపారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించినట్టు రిపోర్టులు వెలువడుతున్నాయి.
కాగా ఆదేశ్ గుప్తా రాజీనామా చేయడంతో ఢిల్లీ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా విరేంద్ర సచ్‌దేవ్ వ్యవహరించనున్నారు. తదుపరి అధ్యక్షుడి నియామకం జరిగే వరకు ఆయనే బాధ్యతల్లో కొనసాగనున్నారని సమాచారం. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (MCD) ఎన్నికల్లో ఆప్ (AAP) ఘన విజయం సాధించింది. ఎండీసీలో మొత్తం 250 వార్డులు ఉండగా.. ఆప్ 134 సీట్లు, బీజేపీ 104 గెలుచుకున్నాయి. 9 సీట్లు మాత్రమే గెలిచిన కాంగ్రెస్ మూడవ స్థానానికి పరిమితమైంది. ఇతరులు 3 స్థానాల్లో గెలుపొందారు.