Tech Summit: నేటి నుంచి నగరంలో బెంగళూరు టెక్‌ సమ్మిట్‌

ABN , First Publish Date - 2022-11-16T11:14:22+05:30 IST

రాజధాని బెంగళూరు నగరం మరో ముఖ్యమైన సదస్సు కోసం సన్నద్ధమైంది. 25వ వార్షిక బెంగళూరు టెక్‌ సమ్మిట్‌(Bangalore Tech Summit) స్థానిక ప్యాలెస్‌

Tech Summit: నేటి నుంచి నగరంలో బెంగళూరు టెక్‌ సమ్మిట్‌

బెంగళూరు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాజధాని బెంగళూరు నగరం మరో ముఖ్యమైన సదస్సు కోసం సన్నద్ధమైంది. 25వ వార్షిక బెంగళూరు టెక్‌ సమ్మిట్‌(Bangalore Tech Summit) స్థానిక ప్యాలెస్‌ మైదానంలో ఈ నెల 16 నుంచి మూడు రోజు ల పాటు జరగనుంది. ఐటీ బీటీ, ఉన్నత విద్యాశాఖల మంత్రి డాక్టర్‌ సీఎన్‌ అశ్వత్థనారాయణ ఈ మేరకు నగరంలో మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈసారి బెంగళూరు టెక్‌ సమ్మిట్‌ బెంగళూరు నగరంతో పాటు చు ట్టు పక్కల ప్రాంతాల్లోనూ ఐటీ బీటీ పరిశ్రమల స్థాపనపై ప్రత్యేకంగా దృష్టి సారించనుందన్నారు. బెంగళూరు నగరంలో మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపరిచేందుకు ప్రభుత్వం శక్తివంచనలేకుండా కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, మెషిన్‌ లర్నింగ్‌, ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌, రోబోటిక్స్‌, చిప్‌ డిజైనింగ్‌, క్లౌడ్‌ కం ప్యూటింగ్‌, ఫిన్‌ టెక్‌ రంగాల్లో స్టార్ట్‌పలకు ఉ త్తేజం కల్పించే దిశలో బెంగళూరు టెక్‌ సమ్మిట్‌లో పలు చర్చా గోష్టులు ఏర్పాటవుతున్నాయని ఆ ప్రకటనలో తెలిపారు. బయోటెక్నాలజీ(Biotechnology) రంగానికి సంబంధించినంతవరకు జినోమిక్‌ విప్లవం 2.0, బయోఫార్మా, జీన్‌ ఎడిటింగ్‌, సింథటిక్‌ బయాలజీ, జినోమిక్‌ మెడిసిన్‌, జీన్‌ థెరపీ వంటి అంశాలపై కూడా ఈ సదస్సులో నిపుణులు ప్రసంగిస్తారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఈ సదస్సు నుంచి వర్చువల్‌గా ప్రసంగిస్తారని, దేశవిదేశాల నుంచి ఐటీబీటీ నిపుణులు పాలుపంచుకుంటున్నారని వెల్లడించారు. బెంగళూరు టెక్‌ స మ్మిట్‌ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై సదస్సులో ప్రతినిధులను ఉద్దేశించి కీలక ప్రసంగం చేస్తారన్నారు.

Updated Date - 2022-11-16T11:14:23+05:30 IST