మామిడి చెట్టుపై దయ్యం
ABN , First Publish Date - 2022-11-06T04:31:29+05:30 IST
ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. పొలం పనులు చేసుకునేవాడు. అతని తోటలో అతనికో పెద్ద మామిడి చెట్టు ఉండేది.
ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. పొలం పనులు చేసుకునేవాడు. అతని తోటలో అతనికో పెద్ద మామిడి చెట్టు ఉండేది. తియ్యని చక్కెరలాంటి పండ్లు కాసేవి. పిల్లలు కానీ కోతులు కానీ ఆ మామిడి చెట్టు వైపు చూస్తే రైతుకి నచ్చేదికాదు. మామిడిపండ్లను అమ్మి డబ్బులు సంపాదించుకునేవాడు. అయితే ఓ ఏడాది పిల్లల దాటికి తట్టుకోలేక ఆ రైతు తల బొప్పి కట్టింది. ఒక్క క్షణం ఇంటికి వెళితే పిల్లలొచ్చి మామిడిపండ్లను రాళ్లతో కొట్టేవాళ్లు. వాళ్లను భయపడిచ్చినా మళ్లీ రావటానికి ప్రయత్నించేవాళ్లు. ఒక కర్ర పట్టుకుని చెట్టు కిందనే కూర్చున్నాడు. అది చూసి పిల్లలు అటుపక్కకు రాలేదు. దీంతో హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నాడు.
ఒక రోజు ఆ రైతు, తన భార్య ఓ వేడుకకు వెళ్లారు. అది కూడా రాత్రిపూట. రాత్రి తేడా చూడకుండా పిల్లలంతా మామిడిచెట్టు దగ్గరకు వెళ్లారు. ముఖ్యంగా నలుగైదురు అమ్మాయిలు ఆ చెట్టు మీదకు ఎక్కి పండ్లను తెంపారు. ఈ విషయం ఉదయాన్నే వచ్చిన రైతుకి తెలిసింది. ఈ మామిడిచెట్టుకి మామిడికాయలు తరగవు. ఇంత పెద్ద చెట్టునుంచి ఒక్క రూపాయి కూడా రాదేమోనని బాధపడ్డాడు. తన భార్య ఓ ఉపాయం చెప్పింది. ఆ చెట్టు మీద దెయ్యం ఉందని నమ్మిస్తే రాత్రిపూట ఎవరూ రారు. పగలు మనం కాపలా ఉండొచ్చంది. ఆ ఉపాయం రైతుకి నచ్చింది. క్షణాలో రైతు భార్య తన పక్క ఇంటి వాళ్లతో ‘మామిడి చెట్టు మీద దెయ్యం ఉంది. నాకు కనిపించింది’ అని చెప్పిందంతే.. ఊరంతా ఆ విషయం పాకింది. మామిడి చెట్టు మీద దెయ్యం.. అనే మాట అందరికీ తెలిసింది. అయినా పిల్లలు అక్కడి వస్తున్నారు.
దీంతో తెల్లవస్త్రం చుట్టుకుని దెయ్యంలా తనే నటించాలనుకుంది రైతు భార్య. రైతు కూడా సరేనన్నాడు. ఒక రోజు రాత్రి కాకముందే రైతు, అతని భార్య చేను దగ్గరకు వెళ్లారు. అతని భార్యను చెట్టెక్కించి.. జాగ్రత్తలు చెప్పాడు. రైతు చేలో కాలువ గట్టు చాటున దాక్కున్నాడు. రాత్రవ్వగానే నలుగురు ఆడపిల్లలు మామిడి చెట్టు దగ్గరకు వచ్చారు. క్షణాల్లో చెట్టును ఎక్కారు. మామిడి పండ్లు తింటూనే జోక్స్ వేసుకుంటున్నారు. పైన కొమ్మమీద ఓ తెల్లదెయ్యం కూర్చుందని ఒకమ్మాయి అన్నది. ఇంతలో ఇంకో అమ్మాయి ‘కొడదాం’అంటూ చెప్పింది.
అందరూ తలా మామిడి కొమ్మకుంటే పెద్ద పుల్లను తుంచి తెల్లదయ్యాన్ని కొట్టారు. రైతు భార్య ఏడ్చింది. వదిలిపెట్టమంది. కిందకి దిగుతూ పొరబాటున కిందపడింది. అవన్నీ పట్టించుకోకుండా వాళ్లు ఆ దెయ్యాన్ని బాదుతుంటే.. ఇంతలో రైతు వచ్చాడు. పిల్లలందరూ పారిపోయారు. రైతు తన భార్యను ఆసుపత్రిలో జాయిన్ చేశాడు. ఆరోజు రాత్రి చెట్టు దగ్గరకు వచ్చిన పిల్లలంతా ఆసుపత్రికి వెళ్లారు. ‘మేమంతా తప్పు చేశాం. క్షమించండి’ అంటూ అడిగారు. ‘మీకు సాయం చేస్తాం కానీ తినం’ అన్నారు. చిన్నపిల్లల మాటలకు రైతు కరిగిపోయాడు. వాళ్లను వదిలేశాడు.