రామాయణాన్ని రచించిన మహోన్నత వ్యక్తి వాల్మీకి
ABN , First Publish Date - 2022-10-10T04:08:35+05:30 IST
రామాయణ మహా గ్రంథాన్ని రచించిన మహోన్నత వ్యక్తి వాల్మీకి మహర్షి అని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. ఆదివారం వాల్మీకి జయంతి సందర్భంగా కలె క్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాల్మీకి చిత్రప టానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

మంచిర్యాల కలెక్టరేట్, అక్టోబరు 9: రామాయణ మహా గ్రంథాన్ని రచించిన మహోన్నత వ్యక్తి వాల్మీకి మహర్షి అని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. ఆదివారం వాల్మీకి జయంతి సందర్భంగా కలె క్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాల్మీకి చిత్రప టానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వాల్మీకి రామాయణ మహా గ్రంథాన్ని రచించి ఆదికవిగా పేరుగాంచారన్నారు. బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వినోద్‌కుమార్, పాల్గొన్నారు.
దండేపల్లి: వాల్మీకి జీవితం నేటి సమాజానికి ఆద ర్శమని వాల్మీకి బోయ సంఘం నాయకులు బొమ్మెన మల్లేష్ అన్నారు. వాల్మీకి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. వాల్మీకి జీవితాన్ని ప్రతీ ఒక్క రు స్ఫూర్తిగా తీసుకొని సన్మార్గంలో నడవాలన్నారు. కార్తీక్, బొమ్మెన సత్యం, కుమార్, సిద్దు, పాల్గొన్నారు.
నెన్నెల: వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చా లని నాయకులు డిమాండ్ చేశారు. ఎస్టీ రిజర్వేషన్ సాధన కోసం ఉద్యమ జెండా పట్టాలని పిలుపుని చ్చారు. అధికారికంగా నిర్వహించిన మహర్షీ వాల్మీకి జ యంతిని వారు బహిష్కరించారు. నల్లబ్యాడ్జీలు ధరిం చి, ప్లకార్డులతో నిరసన తెలిపారు. గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం తమను కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరారు.
భీమారం: బోయవాడలో వాల్మీకి జయంతి వేడుకల ను నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు. విశాల్,మల్లయ్య పాల్గొన్నారు.
మందమర్రి టౌన్: ఆంజనేయ స్వామి ఆలయంలో పట్టణ వాల్మీకి సంఘం ఆధ్వ ర్యంలో వాల్మీకి జయంతి నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సంఘం రాష్ట్ర నాయకు లు బొంది వెంకటరమణ, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రామాయ ణం రచించిన గొప్ప రచయిత వాల్మీకి అని పేర్కొ న్నారు. రవి, శంకర్, కుమారస్వామిలు పాల్గొన్నారు.
మందమర్రిరూరల్: కోదండ రామాలయంలో వాల్మీకి ఐక్య కార్యాచరణ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు వెంకటర మణ, మందమర్రి మండల సభ్యులు బోగి వెంకటేశ్వర్లు వాల్మీకి చిత్రప టానికి నివాళులర్పించారు.
మందమర్రి,: మందమర్రి జీఎం కార్యాల యంలో వాల్మీకి జయంతిని నిర్వహిం చారు. ముఖ్య అతిథిగా జీఎం శ్రీనివాస్ పాల్గొని మహర్షివాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడుతూ వాల్మీకి నోటివెంట వెలువడిన శ్లోకమే రామాయణ మహాకా వ్యానికి నాంది పలికిందన్నారు. ఎస్వోటుజీఎం కృష్ణారావు, సత్యనారాయణ పాల్గొన్నారు.