కమ్యూనిస్టులతోనే జమిందారీ వ్యవస్థకు అడ్డుకట్ట
ABN , First Publish Date - 2022-09-14T05:18:16+05:30 IST
కమ్యూనిస్టులతోనే రాచరిక, జమిందారీ వ్యవస్థకు అడ్డుకట్టపడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కునంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఫణిహారం రంగాచార్యుడి విగ్రహానికి పూలమాలవేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజల బాధలకు విముక్తి కల్పించింది కమ్యునిస్టులేనని అన్నారు.

- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కునంనేని సాంబశివరావు
కామారెడ్డి టౌన్, సెప్టెంబరు 13: కమ్యూనిస్టులతోనే రాచరిక, జమిందారీ వ్యవస్థకు అడ్డుకట్టపడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కునంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఫణిహారం రంగాచార్యుడి విగ్రహానికి పూలమాలవేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజల బాధలకు విముక్తి కల్పించింది కమ్యునిస్టులేనని అన్నారు. వారి పోరాటలతోనే తెలంగాణలో ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చారని అన్నారు. ప్రస్తుతం ఒకరికి పోటీగా ఒకరు కార్యక్రమాలు చేస్తామంటూ బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు విమోచన, విలీనం అంటూ ఉత్సవాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. అమరుల త్యాగాలను స్వార్థ రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటని ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలిపారు. తెలంగాణ మీద ప్రేమ ఉంటే సీఎం కేసీఆర్ తెలంగాణ సాయుధ పోరాటాలు, కమ్యూనిస్టుల పోరాటల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని తెలిపారు. మొదటి దశ పోరాటంలో ఉన్న రంగాచారి కామారెడ్డి వాసి కావడం జిల్లావాసుల అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సభ్యురాలు పద్మ, బాల మల్లేషం, సీనియర్ నాయకుడు నర్సింహారెడ్డి, జిల్లా కార్యదర్శి దశరథ్, సహాయ కార్యదర్శి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.