హరితహారానికి చేయూత అభినందనీయం: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-07-30T04:57:22+05:30 IST

హరితహారానికి చేయూత అభినందనీయం: కలెక్టర్‌

హరితహారానికి చేయూత అభినందనీయం: కలెక్టర్‌
కలెక్టర్‌కు నిఖిలకు చెక్కు అందజేస్తున్న క్రషర్‌ అసోసియేషన్‌ సభ్యులు

వికారాబాద్‌, జూలై29 : వికారాబాద్‌ జిల్లాలో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మన్నెగూడ నుంచి వికారాబాద్‌ మెయిన్‌రోడ్డు, బీజాపూర్‌ హైవే రోడ్డుకు ఇరువైపులా మల్టీ లేయర్‌ పద్దతిలో రెండు వేల మొక్కలు కొనుగోలు చేసి నాటేందుకు తాండూరు నాపరాతి క్రషింగ్‌ అసోసియేషన్‌ సహాకారం అందించడం  సంతోషమని కలెక్టర్‌ నిఖిల తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఏడీమైన్స్‌శాఖ ఆధ్వర్యంలో స్టోన్‌ అండ్‌ క్రషింగ్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ చైతన్య, సభ్యులు కలెక్టర్‌కు ప్రత్యేకంగా కలిసి అందుకు సంబంఽధించిన చెక్కును అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ. ఈసారిహరితహారంలో గతంలో కన్నా భిన్నంగా అవెన్యూ ప్లాంటేషన్‌లో మొక్కలు నాటి వికారాబాద్‌ను గ్రీన్‌ సిటీగా మారుస్తామన్నారు. కార్యక్రమంలో ఏడీమైన్స్‌ అధికారి సాంబశివరావు, డీఆర్‌డీవో కృష్ణన్‌,  సెక్రటరీ శ్రీనివా్‌సరెడ్డి , హరికృష్ణ, మోహన్‌ దాస్‌, లంక లక్ష్మీకాంత్‌రెడ్డి, బీలాల్‌ హుస్సేన్‌, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. జిల్లాలో అవెన్యూ ప్లాంటేషన్‌ కోసం పెద్దసైజు మూడు వేల మొక్కలు నాటేందుకు సీఎ్‌సఆర్‌(కార్పోరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ) కింద రూ.4.50ల చెక్కును బ్యాంక్‌ అధికారులు కలెక్టర్‌ నిఖిలకు అందజేశారు. ఇట్టి సహకారానికి కలెక్టర్‌ బ్యాంక్‌ అధికారులను అభినందించారు. కార్యక్రమంలో యల్‌డీఎం రాంబాబు, ఎస్‌బీఐ చీఫ్‌మేనేజర్‌ అనుప్రభ, డీఆర్‌డీవో కృష్ణన్‌, సీఏసీ మేనేజర్‌ రామాంజనేయులు, యస్‌బీఐ ఫీల్డ్‌ ఆఫీసర్‌ ధనుంజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-30T04:57:22+05:30 IST