రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి
ABN , First Publish Date - 2022-11-09T05:33:05+05:30 IST
రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు రెండురోజుల్లో తగిన చర్యలు
![రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ట్రెసా వినతికి సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు రెండురోజుల్లో తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ తమకు హామీ ఇచ్చారని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్(ట్రెసా)అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ముసారంబాగ్ రెవిన్యూభవన్‌లో ట్రెసా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగిందని, శాఖ ఉద్యోగుల సమస్యలపై చర్చించామని వారు చెప్పారు. అనంతరం కేటీఆర్‌ను కలిసి విన పత్రం సమర్పించినట్లు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో వీఆర్‌ఏ జేఏసీ నాయకులు ఉన్నారు.