Vijayashanti: ధాన్యం కొని డబ్బులేందుకు ఇవ్వరు?

ABN , First Publish Date - 2022-11-18T19:34:37+05:30 IST

TS News: తెలంగాణలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారు. అయితే 15 రోజులు గడుస్తున్నా అధికారులు వారికి డబ్బులు చెల్లించలేదు. సంగారెడ్డి జిల్లాలో కొంతమంది రైతులకే డబ్బులు అందడంపై బీజేపీ (BJP) నాయకురాలు విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Vijayashanti: ధాన్యం కొని డబ్బులేందుకు ఇవ్వరు?

TS News: తెలంగాణలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారు. అయితే 15 రోజులు గడుస్తున్నా అధికారులు వారికి డబ్బులు చెల్లించలేదు. సంగారెడ్డి జిల్లాలో కొంతమంది రైతులకే డబ్బులు అందడంపై బీజేపీ (BJP) నాయకురాలు విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉందని, రైతులను ఇబ్బంది పెట్టడం కేసీఆర్ సర్కారుకు మంచిది కాదని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

విజయశాంతి పోస్టు యథాతథంగా..

‘‘తెలంగాణలో వానాకాలం సీజన్​కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమై 15 రోజులు గడచినా.. ఇంకా వడ్లు అమ్మిన రైతన్న‌ల‌కు పైసలు వస్తాలేవు. రైస్​మిల్లర్లతో సివిల్​ సప్లై డిపార్ట్​మెంట్​ అగ్రిమెంట్​ ప్రాసెస్​ డిలే కావడంతో పేమెంట్​ జరగడం లేదు. దీంతో అన్న‌దాత‌లు ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 10,361 మంది రైతుల నుంచి 56,529 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో 53,111 మెట్రిక్ టన్నులు రైస్ మిల్లులకు త‌ర‌లించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రూ.116 కోట్లు చెల్లించాల్సి ఉండగా, కేవలం 1,176 మంది రైతన్న‌ల‌కు రూ.14.44 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇంకా 9,185 మంది రైతులకు రూ.102 కోట్లు పెండింగ్ ఉన్నాయి. ఒక్క సంగారెడ్డి జిల్లాలో కాదు. రాష్ట్ర‌వ్యాప్తంగా కూడా ఇదే ప‌రిస్థితి ఉంది. అన్న‌దాతలు ఇలా ఇబ్బందులు ప‌డుతుంటే వారి ఆదుకోవాల్సిన ప్ర‌భుత్వం వారిని క‌నీసం ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. అన్న‌దాత‌ల‌ను అరిగోసలు పెడుతున్న కేసీఆర్ స‌ర్కార్ కు తెలంగాణ రైతులు త‌గిన స‌మాధానం చెబుతారు.’’ అని విజ‌య‌శాంతి పేర్కొన్నారు.

Updated Date - 2022-11-18T19:34:38+05:30 IST