Share News

‘రాజీవ్‌ యువ వికాస్‌’ యువతకు వరం

ABN , Publish Date - Apr 03 , 2025 | 12:43 AM

రాజీవ్‌ యువ వికాస్‌ పథకం నిరుద్యో గ యువతకు వరంలాంటిదని, యువత ఉపాధి కోసం దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయ న మాట్లాడారు.

‘రాజీవ్‌ యువ వికాస్‌’ యువతకు వరం

దరఖాస్తులకు ఈ నెల 14 గడువు

అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి

భువనగిరి (కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): రాజీవ్‌ యువ వికాస్‌ పథకం నిరుద్యో గ యువతకు వరంలాంటిదని, యువత ఉపాధి కోసం దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయ న మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ, ఈబీసీ నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం మండల ప్రజాపాలన కేంద్రాలు, మునిసిపల్‌ ప్రజాపాలన కేంద్రాల్లో ఈ నెల 14వతేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు 14వేల దరఖాస్తులు స్వీకరించామన్నారు. దరఖాస్తు ఫారాలు మండల కేంద్రాల్లో అందుబాటులో ఉంచామని, హెల్ప్‌డె స్క్‌లు కూడా ఏర్పాటు చేయాలని అధికారుల కు సూచించారు. పథకంపై ప్రజల్లో విస్తృత ప్ర చారం నిర్వహించాలని సూచించారు. ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, ని బంధనలకు అనుగుణంగా నాణ్యతా ప్రమాణా లు పాటించాలని ఆదేశించారు. సమావేశంలో జడ్పీ సీఈవో ఎన్‌.శోభారాణి, ఆర్డీవో ఎం.కృష్ణారెడ్డి, డీపీవో సునంద, డీఈబ్ల్యువో నరసింహారా వు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్యాంసుందర్‌, గృహ నిర్మాణశాఖ పీడీ విజయ్‌సింగ్‌, డీఈఈ శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.

బహుజన వీరుడు సర్వాయి పాపన్నగౌడ్‌

సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ బహుజన పో రాట యోధుడని అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సర్వాయి పాపాన్నగౌడ్‌ వర్ధంతిలో ఆయన మాట్లాడారు. పాపన్నగౌడ్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమాధికారి యాదయ్యతోపాటు పలువురు అధికారులు, మోకుదెబ్బ సంఘం జిల్లా అధ్యక్షుడు రమే్‌షగౌడ్‌, గౌడ సంఘాల నాయకులు జైహింద్‌ గౌడ్‌, బైరి విశ్వనాథంగౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2025 | 12:43 AM