చైర్‌పర్సన ఏకపక్ష నిర్ణయాలు?

ABN , First Publish Date - 2023-04-29T00:07:30+05:30 IST

పట్టణ మున్సిపాలిటీ పాలకవర్గంలో వర్గపో రు రాజుకుంటూనే ఉంది. అధికార వైసీపీ చైర్‌పర్సన ఇంద్రజ పాలనలో ఏక పక్ష నిర్ణయాలపై తోటి కౌన్సిలర్లే పెదవి విరుస్తున్నారు.

చైర్‌పర్సన ఏకపక్ష నిర్ణయాలు?

అభివృద్ధి పనుల కేటాయింపులో వివక్ష

అసమ్మతి వర్గ కౌన్సిలర్ల గుర్రు

కౌన్సిల్‌ వేదికగా గళం విప్పేందుకు నిర్ణయం

నేడు మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం

హిందూపురం, ఏప్రిల్‌ 28: పట్టణ మున్సిపాలిటీ పాలకవర్గంలో వర్గపో రు రాజుకుంటూనే ఉంది. అధికార వైసీపీ చైర్‌పర్సన ఇంద్రజ పాలనలో ఏక పక్ష నిర్ణయాలపై తోటి కౌన్సిలర్లే పెదవి విరుస్తున్నారు. మున్సిపల్‌ పాలకవ ర్గం ఏర్పడినప్పటి నుంచి అధికార వైసీపీలో కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. తరచూ ఒకరిపై ఒకరు విమర్శలు సంధిస్తూ బజారుకెక్కుతున్నా రు. తాజాగా చైర్‌పర్సన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని అసమ్మతి వ ర్గంలోని కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఇక్బాల్‌ వర్గానికి అనుకూలం గా ఉన్న కౌన్సిలర్లు అడిగిందే తడవుగా పనులు చేసి పెడుతున్నారనీ, సభ్యు లందరినీ ఒకేలా చూడడంలేదంటూ కొంతమంది కౌన్సిలర్లు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీలో 38 వార్డులుండగా, 30 మంది అధికార వైసీపీ కౌన్సిలర్లే ఉన్నారు. ఇందులో అధికశాతం మంది ఎమ్మెల్సీకి వ్యతిరేక వర్గంగా జతకట్టారు. చైర్‌పర్సన... ఎమ్మెల్సీ వర్గంలో ఉన్నారు. ఆమె తీసుకునే నిర్ణయాలకు అదేపార్టీలోని అసమ్మతి వర్గ కౌన్సిలర్లు అడ్డుతగులుతున్నారు. ఇటీవల ముగిసిన కౌన్సిల్‌ ఎజెండాలో అభివృద్ధి పనులను అసమ్మతి వర్గంలో ని కౌన్సిలర్లకు మొండిచేయి చూపారని వాపోతున్నారు.

కొన్ని వార్డులకే అభివృద్ధి పనులు..

పట్టణ ప్రథమ పౌరురాలిగా చైర్‌పర్సన అన్ని వార్డులకు సమాన న్యాయం చేయాలి. అయితే ఎమ్మెల్సీ వర్గంలోని కౌన్సిలర్‌ వార్డులకు సంబంధించి అడక్కపోయినా పనులు పెడుతున్నారు. వాటికి నిధులు కూడా మంజూరు చేస్తామని హామీలు ఇస్తున్నారు. అయితే మిగిలిన వార్డులకు ఎందుకు నిధులు ఇ వ్వలేదో, ఎజెండాలో ఎందుకు పనులు పొందుపరచలేదని ప్రశ్నిస్తున్నారు. స మస్య జటిలంగా ఉన్నచోటకూడా పని పెట్టకపోవడం వెనుక ఆంతర్యం ఏంట ని వాపోతున్నారు.

ముఖ్యంగా వైస్‌చైర్మన వార్డుకు సంబంధించి దీర్ఘకాలికంగా సమస్య ఉంది. ఇందుకోసం రూ.39 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి సాధారణ నిధుల కింద కౌన్సిల్‌ ఆమోదం తెలపాలని ఎజెండాలో అధికారులు పొందుప రిచారు. కానీ దానిని ఎజెండాలో పెట్టకూడదంటూ చైర్‌పర్సన ఆదేశించినట్లు సమాచారం. దీనివల్ల వైస్‌ చైర్మన తాడోపేడో తేల్చుకోవాలని సిద్ధపడుతున్న ట్లు ఆవర్గాల ద్వారా తెలిసింది. గత మున్సిపల్‌ ఎన్నికల్లో కొన్నివార్డులకు ఖర్చులు కూడా భరించారు. అప్పట్లో చైర్మన అవకాశం వస్తుందని ఆశ పడ్డా డు. ఈనేపథ్యంలో బీసీలకు చైర్‌పర్సన పదవి దక్కడంతో, రెండో వైస్‌చైర్మనగా ఆయనకు అవకాశం కల్పించారు. ఇంత ఖర్చుపెట్టుకున్న తనకే పాలకవర్గంలో సముచిత స్థానం దక్కలేదని.. మొదటి నుంచి ఎమ్మెల్సీ ఇక్బాల్‌ను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వార్డుల అభివృద్ధి పనులకు అవకాశం క ల్పించరా అంటూ మండిపడుతున్నారు. దీనిపై కమిషనర్‌ను అడగ్గా, కొత్తగా విధుల్లో చేరానంటూ తప్పించుకుంటున్నారని కొంతమంది కౌన్సిలర్లు చెప్పుకుంటున్నారు. మరికొంతమంది అసమ్మతి వర్గంలోని కౌన్సిలర్లకు సంబంధించిన వార్డుల్లో ఇలాగే మొండిచేయి చూపుతున్నారని బహిరంగంగా చర్చించుకుంటున్నారు.

ఐదు నెలలుగా ప్రారంభంకాని సెంట్రల్‌ లైటింగ్‌

పట్టణంలోని పెనుకొండ రోడ్డులో సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటుచేసి ఐదు నె లలైంది. సంబంధిత ఏజెన్సీ నిర్వాహకులు మున్సిపాలిటీలోని ముఖ్య ప్రజాప్రతినిధిని కలవకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు అసమ్మతి వర్గంలోని కొంతమంది కౌన్సిలర్లు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. అందులో వాటా ఇవ్వకపోవడంతోనే పనులు పూర్తయినా ప్రారంభించలేదని గతంలో కూడా కౌన్సిల్‌ లో ఆరోపించారు.

అయినా ఇప్పటివరకు ప్రారంభించలేదు. దీంతో ఈ సమస్యపై కౌన్సిల్‌లో నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు కొత్త కమిషనర్‌పైనా పలువురు విమర్శలు మొదలుపెడుతున్నారు. ముఖ్య ప్రజాప్రతినిధి చెప్పినట్లే నడుచుకుంటున్నాడని మండి పడుతున్నారు.

కౌన్సిల్‌ సమావేశం సజావుగా సాగేనా?

మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం శనివారం జరగనుంది. ఎలాగైనా సమావేశాన్ని అడ్డుకుని తమ నిరసనను అధిష్టానానికి తెలిసేవిధంగా చేయాలని కొం తమంది కౌన్సిలర్లు సిద్ధమైనట్లు సమాచారం. ముఖ్య ప్రజాప్రతినిధుల బాగోతాలపై ప్లకార్డులు ప్రదర్శించనున్నట్లు చర్చ జరుగుతోంది. అసమ్మతి వర్గంలో ని కౌన్సిలర్లు అనుకున్నట్లు సమావేశం జరక్కపోతే అడ్డుకునేందుకు అన్నివిధాలా అస్ర్తాలను ప్రయోగించనున్నట్లు తెలిసింది. రెండేళ్లలో ఎప్పుడూలేనివిధంగా తమ వాణిని వినిపించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈనేప థ్యంలో కౌన్సిల్‌ సమావేశం ఉత్కంఠ రేపుతోంది.

Updated Date - 2023-04-29T00:07:30+05:30 IST