నిమిషమే.. మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం

ABN , First Publish Date - 2023-04-30T00:13:38+05:30 IST

పట్టణ మున్సిపల్‌ చరిత్రలో అధికార వైసీపీ పాలకవర్గం మాయని మచ్చను తెచ్చుకుంది. పురం అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కార వేదిక అభాసుపాలైంది. ఎన్నడూలేని విధంగా ఒక్క నిమిషంలోనే అజెండాలోని అంశాల సంఖ్య చెప్పి... ఏకం గా కౌన్సిల్‌ సమావేశం ముగిస్తున్నట్లు చైర్‌పర్సన ఇంద్రజ ప్రకటించా రు.

నిమిషమే.. మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం

భగ్గుమన్న అసమ్మతి సెగ

సమావేశ మందిరంలో రచ్చ రచ్చ

చైర్‌పర్సన అవినీతిపై మండిపాటు

రాజీనామా చేయాలని డిమాండ్‌

నల్లబ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులతో నిరసన

పోడియం ఎదుట టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల బైఠాయింపు

హిందూపురం, ఏప్రిల్‌ 29: పట్టణ మున్సిపల్‌ చరిత్రలో అధికార వైసీపీ పాలకవర్గం మాయని మచ్చను తెచ్చుకుంది. పురం అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కార వేదిక అభాసుపాలైంది. ఎన్నడూలేని విధంగా ఒక్క నిమిషంలోనే అజెండాలోని అంశాల సంఖ్య చెప్పి... ఏకం గా కౌన్సిల్‌ సమావేశం ముగిస్తున్నట్లు చైర్‌పర్సన ఇంద్రజ ప్రకటించా రు. ఆ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంకా కూర్చునేందుకు సీట్లు కూడా సర్దుకోలేని కౌన్సిలర్లు ఈ పరిణామంతో అవాక్కయ్యారు. శనివారం మున్సిపల్‌ కార్యాలయ సమావేశ మందిరంలో కౌన్సిల్‌ సా ధారణ సమావేశాన్ని చైర్‌పర్సన ఇంద్రజ అధ్యక్షతన నిర్వహించారు. స మావేశం ప్రారంభం కాగానే ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం అ జెండాలోని అంశాల సంఖ్యను చదివించారు. ఆ నిమిషమే సమావేశం ముగిసినట్లు ప్రకటించారు. అయితే టేబుల్‌ అజెండాలో కొన్ని అంశాల ను పొందుపరిచారు. వాటిని సమావేశంలో ప్రవేశపెట్టలేదు. ఒక నిమిషంలోనే సమావేశం ముగించడంపై వైసీపీ అసమ్మతి వర్గం ఒక్కసారిగా భగ్గుమంది. చైర్‌పర్సన వెళ్లిపోయినా సమావేశ మందిరాన్ని వీ డలేదు. కౌన్సిలర్లు శివ, ఆసిఫ్‌, పార్వతి, రామచంద్ర, సాజియా, లక్ష్మీతోపాటు మరికొంతమంది కౌన్సిల్‌హాల్‌లోనే బైఠాయించారు. చైర్‌పర్సన తీరును నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. నల్లబ్యాడ్జీలు కట్టుకుని ని రసన తెలియజేశారు. ఈసందర్భంగా కౌన్సిలర్‌ శివ మాట్లాడుతూ స మావేశం వెంటనే ఎందుకు ముగించారని నిలదీశారు. చైర్‌పర్సన బండారం ఎక్కడ బయటపెడతారోనని భయపడి ముగించారని ఆరో పించారు. టేబుల్‌ అజెండాలోని అంశాలను రద్దు చేశారు. లేకుండా ఉంటే లక్షలాది రూపాయలు మున్సిపాలిటీకి నష్టం జరిగేదన్నారు. చైర్‌పర్సన అవినీతి మితిమీరిందని మండిపడ్డారు. మున్సిపాలిటీలో ఏ పని కావాలన్నా లంచం ఇవ్వాల్సిందేనంటూ ఆరోపించారు. చెత్త పరిపాలనతో పార్టీని, ప్రజలను భ్రష్టుపట్టిస్తున్నారన్నారు. మున్సిపాలిటీలోని ముఖ్య ప్రజాప్రతినిధి భూకబ్జాపై కౌన్సిలర్లు ఫిర్యాదు చేస్తే, విచారణ ఎక్కడ వరకు వచ్చింది అధ్యక్షా అంటూ ప్లకార్డులు చూపారు. సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం ఏర్పాటుచేసి ఐదు నెలలవుతున్నా ఎందుకు ప్రారంభించలేదన్నారు. ప్రతిపనికి ఒక ధర నిర్ణయించి మున్సిపాలిటీని బజారుకీడుస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కాంట్రాక్టర్లు భయపడే స్థాయికి వచ్చారన్నారు. కౌన్సిలర్లంటే లెక్కలేదని, అలాంటప్పుడు మేం కౌన్సిలర్లుగా ఎందుకున్నామని ప్రశ్నించారు. చైర్‌పర్సన రాజీనా మా చేయాలంటూ డిమాండ్‌ చేశారు. ఇంత తతంగం జరుగుతున్నా చైర్‌పర్సన ఆవైపు తిరిగి చూడలేదు. ఏదీ పట్టించుకోకుండా చాంబర్‌లోకి వెళ్లి తన వర్గ కౌన్సిలర్లతో ఉండిపోయారు. ఆఖరికి చేసిదిలేక వైసీపీ అసమ్మతి కౌన్సిలర్లు బయటికి వెళ్లిపోయారు.

ఇదిలా ఉంటే సమావేశానికి ముందే వైస్‌ చైర్మన బలరాంరెడ్డి చాం బర్‌లో అసమ్మతివర్గ కౌన్సిలర్లు సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ వర్గంలోని కౌన్సిలర్లకు పనులు కల్పిస్తున్నారని, తమకు గౌరవం దక్కలేదని, అలాంటప్పుడు చైర్‌పర్సనను నిలదీయాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌, చైర్‌పర్సన ఇంద్రజకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైస్‌ చైర్మన బలరాంరెడ్డి ఒక్కరే కుర్చీలో కూర్చుండిపోయారు. ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన కౌన్సిల్‌ స మావశం జరిగి ఇలా అర్ధంతరంగా ముగియడం భావ్యం కాదన్నారు.

టీడీపీ కౌన్సిలర్ల నిరసన

నిమిషంలో అజెండాలోని అంశాల సంఖ్యను చదివి వినిపించి సమావేశం ముగిసినట్లు ప్రకటించడంతో టీడీపీ కౌన్సిలర్లు మండిపడ్డారు. పోడియం ముందు కూర్చొని నిరసన తె లుపుతూ, చైర్‌పర్సన ఏక పక్ష నిర్ణయాల వల్ల పట్టణ అభివృద్ధి నాశనమైందని మండిపడ్డారు. అవగాహన లేక పరిపాలన గాలికి వదిలారని విమర్శించారు. వైసీపీలోని వర్గపోరుతో నిమిషంపాటులో సమావేశం ముగించడం ఏంటని మండిపడ్డారు. ఎంతసేపటికీ చైర్‌పర్సన రాకపోవడంతో ఎమ్మెల్సీకి, చైర్‌పర్సనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఆ వార్డులకే అధిక నిధులిచ్చాం:

ఇంద్రజ, చైర్‌పర్సన

మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో తమ వార్డులకు అన్యాయం చేశారని ఎవరు ఆరోపిస్తున్నారో.. వారికే అత్యధిక నిధులు ఇచ్చామని చైర్‌పర్సన వివరాలతో కూడిన పత్రాలను విలేకరులకు చూపించారు. అం తేకాక ఇతర వార్డులకంటే వారికే బిల్లులు కూడా మంజూరు చేయించామన్నారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తున్నారని ఆరోపించారు. తాను మహిళ అనికూడా చూడకుండా విమర్శలు చేయడం నన్ను ఎం తగానో కలచివేసిందని వాపోయారు.

Updated Date - 2023-04-30T00:13:38+05:30 IST