మే 16, 17 తేదీల్లో చిత్తూరు నడివీధి గంగజాతర

ABN , First Publish Date - 2023-04-19T01:07:01+05:30 IST

చిత్తూరు నడివీధి గంగమ్మ జాతరను మే నెల 16, 17 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు ఉత్సవ నిర్వాహక వంశపారంపర్య ధర్మకర్త సీకే తెలిపారు.

మే 16, 17 తేదీల్లో చిత్తూరు నడివీధి గంగజాతర
నడివీధి గంగజాతర గోడపత్రికను ఆవిష్కరిస్తున్న సీకే బాబు తదితరులు

చిత్తూరు కల్చరల్‌, ఏప్రిల్‌ 18: చిత్తూరు నడివీధి గంగమ్మ జాతరను మే నెల 16, 17 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు ఉత్సవ నిర్వాహక వంశపారంపర్య ధర్మకర్త సీకే తెలిపారు. చిత్తూరులోని పొన్నియమ్మగుడిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మే 9వ తేదీన గంగజాతర నిర్వహణకు చాటింపు వేస్తామన్నారు. గంగజాతర సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నామని, మే 16న అమ్మవారికి పూజలు నిర్వహించి తెర తొలగింపు అంబలి నిర్వహించనున్నామని, 17న అమ్మవారిని అత్యంత వేడుకగా ఊరేగించి కట్టమంచి చెరువులో నిమజ్జనం చేయనున్నామని ఆయన పేర్కొన్నారు. జాతర గోడపత్రికలను విడుదల చేశారు. ఉత్సవ నిర్వాహక కమిటీ సభ్యులు హేమంత్‌కుమార్‌, వెంకటేశ్‌, గుణశేఖర్‌, వేమారెడ్డి, గురుమూర్తి, నారాయణరెడ్డి, ఆలయ అర్చకుడు కేదారేశ్వరన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-19T01:07:01+05:30 IST