Share News

బీపీసీఎల్‌ పైపులైన్‌ పనులను అడ్డుకున్న రైతులు

ABN , Publish Date - Mar 26 , 2025 | 11:33 PM

ఒంగోలు కార్పొరేషన్‌ పరిధిలోని పేర్నమిట్టలో బీపీసీఎల్‌ పైపులైన్‌ను బుధవారం రైతులు అడ్డుకున్నా రు.

బీపీసీఎల్‌ పైపులైన్‌ పనులను అడ్డుకున్న రైతులు
బీపీసీఎల్‌ పైపులైన్‌ పనులను అడ్డుకున్న రైతులు

రూ.-కోట్ల విలువ చేసే భూముల్లో పైపులైన్‌ వేయడంపై ఆగ్రహం

సంతనూతలపాడు, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ఒంగోలు కార్పొరేషన్‌ పరిధిలోని పేర్నమిట్టలో బీపీసీఎల్‌ పైపులైన్‌ను బుధవారం రైతులు అడ్డుకున్నా రు. బీపీసీఎల్‌ ప్రతినిధులు గతంలో రై తుల ప్రమేయం లేకుండా విలువైన భూ ముల్లో పైపులైన్‌ను వేస్తుండటంతో నా లుగు నెలల క్రితం పేర్నమిట్ట రైతులు అడ్డుకున్నారు. అనంతరం నాడు కలెక్టర్‌, స్థానిక ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ దృష్టికి వెళ్లారు. వెంటనే కలెక్టర్‌ ఆదేశాలతో జాయింట్‌ కలెక్టర్‌ అధ్యక్షతన పేర్నమిట్ట రైతులు, స్థానిక నాయకులు, బీపీసీఎల్‌ ప్రతినిధులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా పైపులైన్‌ రోడ్డు వెంట వేయాలని, పైపులైన్‌ను కార్పొరేషన్‌ పరిధిలోని రూ.కోట్ల విలువైన కన్వర్షన్‌ భూముల్లో కాకుండా, తక్కువ విలువ కలిగిన భూముల్లో వేయాలని రైతులు, నాయకులు తెలిపారు. రైతులు చెప్పిన విధంగా పైపులైన్‌ ఏర్పాటు చేస్తామని బీపీఎల్‌ ప్రతినిధులు హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది.అయితే ఆ సంస్థ ప్రతినిధులు మరలా తమ ఇష్టారీతిని విలువైన భూముల్లో పైపులైన్‌ వేస్తుండటంతో బుధవారం రైతులు అడ్డుకుని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వారిని కలెక్టర్‌ ను కలవాలని, తాను కూడా సమస్యను కలెక్టర్‌కు వివరిస్తానని హామీ ఇచ్చారు.

Updated Date - Mar 26 , 2025 | 11:33 PM