మైనార్టీల సంక్షేమానికి కట్టుబడిన ప్రభుత్వం
ABN , Publish Date - Mar 26 , 2025 | 11:35 PM
మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందులు దోహ దపడుతాయని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారా యణరెడ్డి తెలిపారు.

- ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందులు దోహ దపడుతాయని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారా యణరెడ్డి తెలిపారు. పవిత్రమైన రంజాన్ మా సంలో ముస్లింలకు ప్రభుత్వం ఇఫ్తార్ విందు అ ధికారికంగా ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. క ల్వకుర్తి పట్టణంలోని అబుబాకర్ ఫంక్షన్ హాల్ లో బుధవారం ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏ ర్పాటు చేశారు. ముస్లిం సోదరులతో కలిసి ఎ మ్మెల్యే ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం, మై నార్టీల అభివృద్ధి, సంక్షేమానికి సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అంతకుముందు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కల్వకు ర్తి పట్టణంలోని పాత, కొత్తమస్జీద్‌ల వద్ద జ రుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే కశిరెడ్డి నారా యణరెడ్డి స్థానిక నాయకులతో కలిసి బుధవా రం పరిశీలించారు. కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు సభ్యుడు ఠాకూర్ బాలాజీసింగ్, కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్‌కు మా ర్, తహసీల్దార్ ఇబ్రహీం, కమిషనర్ మహమ్మద్ షేక్, మార్కెట్ చైర్మన్ మనీలా సంజుకుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమాకాంత్‌రెడ్డి, మా ర్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ షానవా జ్‌ఖాన్, కాంగ్రెస్ నాయకులు పాల్గొ న్నారు.
ఫ కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో బుధవారం కల్వకుర్తి, వెల్దండ మండలాలకు చెంది న 105 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి పంపిణీ చేశారు.
పోషకాహారం కిట్ల పంపిణీ
కల్వకుర్తి పట్టణంలోని ప్ర భుత్వ ఆసుపత్రిలో క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లను ఎమ్మె ల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి పంపిణీ చేశారు. కార్యక్ర మంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స భ్యుడు ఠాకూర్ బాలాజీసింగ్, డీఎంహెచ్‌వో స్వ రాజ్యలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్‌వో భీమానాయక్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం, నాయకులు ఉన్నారు.
నమూనా ఇంటికి భూమిపూజ
వెల్దండ : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ నమూనా ఇంటి నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి భూమిపూజ చేశారు. నిరుపేద లబ్ధిదారులకు ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇంటిని అందిస్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై మంజూరైన స్ర్పింక్లర్లను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందించారు. ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేస్తే సాగు విస్తీర్ణం పెరుగుతుందని పేర్కొన్నారు. వ్యవసాయానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇ స్తుందన్నారు. కార్యక్రమంలో పీసీబీ సభ్యుడు బాలాజీసింగ్, పీఏసీఎస్ డైరెక్టర్లు వెంకటయ్యగౌడ్, సంజీవ్‌కుమార్, మార్కెట్ డైరెక్టర్లు కేశమళ్ల కృష్ణ, రాజశేఖర్, తహసీల్దార్ కార్తీక్‌కుమార్, ఎంపీడీవో సత్యపాల్‌రెడ్డి, ఉద్యానవనశాఖ అధికారి మహేశ్వరి, నాయకులు భూపతిరెడ్డి, మోతీలాల్, పర్వత్‌రెడ్డి, పుల్లయ్య, రషీద్, ఎర్ర శ్రీను, నారాయణ, కార్యదర్శి గిరి ఉన్నారు.