Share News

క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ

ABN , Publish Date - Mar 26 , 2025 | 11:33 PM

పౌష్టికాహా రంతో క్షయవ్యాధిగ్రస్తులు త్వ రగా కోలుకుంటారని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కేవీ స్వరాజ్యలక్ష్మి వె ల్లడించారు.

క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ
కొల్లాపూర్‌లో క్షయవ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లు అందజేస్తున్న డీఎంహెచ్‌వో కేవీ స్వరాజ్యలక్ష్మి

- డీఎంహెచ్‌వో డాక్టర్‌ కేవీ స్వరాజ్యలక్ష్మి

కొల్లాపూర్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : పౌష్టికాహా రంతో క్షయవ్యాధిగ్రస్తులు త్వ రగా కోలుకుంటారని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కేవీ స్వరాజ్యలక్ష్మి వె ల్లడించారు. బుధవారం పట్ట ణంలోని ప్రభుత్వ ఏరియా ఆ సుపత్రి ఆవరణలో క్షయవ్యా ధిగ్రస్తులకు ఉచి తంగా పోషకాహార కిట్టును ఇచ్చే కార్యక్రమాన్ని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధి కారి డాక్టర్‌ కేవీ స్వరాజ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... క్షయ వ్యాధిగ్రస్తులు ప్రతీ రోజు చికిత్సతో పాటుగా ఈ అదనపు పోషకాహార కిట్టును వినియోగిం చుకుని వ్యాధి నుంచి తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షయ వ్యాధిగ్రస్తుల బ్యాంకు ఖా తాలో ప్రతీనెల వెయ్యి రూపాయలు జమ చేస్తున్నామని తెలిపారు. ప్రతీ పోషకాహార కిట్టులో మూడు కిలోల గోధుమ పిండి, 1.5 కి లోల కందిపప్పు, 250 మిల్లీ లీటర్ల నూనె, ఒక కేజీ పల్లీలు ఉంటాయని తెలిపారు. అనంతరం కొల్లాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఎన్సీడీ క్లినిక్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటదాస్‌, కొల్లాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెం డెంట్‌ డాక్టర్‌ శ్రీనివాసులు, నాట్కో ఫార్మా కంపెనీ ప్రతినిధి డాక్టర్‌ మదన్మోహన్‌, ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ రాజశేఖర్‌, వైద్యాధికారి డాక్టర్‌ రోహిత్‌, డీపీవో రేణయ్య, సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ కిషోర్‌, సాయిరె డ్డి, రామ్మోహన్‌, ఎస్‌టీ ఎస్‌ ఆరిఫ్‌ఖాన్‌, ముక్తార్‌, రాజ్‌ కుమార్‌, ఇతర పర్యవేక్షణ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, క్షయ వ్యాధిగ్రస్తులు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2025 | 11:33 PM