Share News

కరువు నివారణే లక్ష్యం

ABN , Publish Date - Mar 26 , 2025 | 11:36 PM

‘జిల్లాను కరువు, వలసలు వెంటాడుతున్నాయి.

కరువు నివారణే లక్ష్యం

ఆర్డీఎస్‌, వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులు పునఃప్రారంభించాలి

కర్నూలు స్మార్ట్‌సిటీ కోసం రూ.400 కోట్లు

కరువు మండలాల్లో శాశ్వత రెసిడెన్సియల్‌ స్కూళ్లు

సీఎం చంద్రబాబుకు వివరించిన కలెక్టర్‌ పి.రంజితబాషా

తలసరి ఆదాయం, సేవల్లో వెనకబాటు

హంద్రీనీవా గేమ్‌ ఛేంజర్‌

సీఎం చంద్రబాబు వెల్లడి

‘జిల్లాను కరువు, వలసలు వెంటాడుతున్నాయి. ఆర్డీఎస్‌, వేదవతి, గుండ్రేవులు, హంద్రీనీవా ప్రాజెక్టులు పూర్తి చేస్తే కరువు నివారణకు శాశ్వత పరిష్కారం. అవసరమైన నిధులు ఇవ్వాలి. కర్నూలు స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి కోసం రూ.400 కోట్లు కావాలి. 80 గ్రామాలకు ప్రయోజనం చేకూర్చే ఏఐఐబీ పనులు కొసాగించాలి. తల్లిదండ్రులతో వలసలు వెళ్తున్న విద్యార్థుల ఉజ్వల భవిత.. చదువులు మధ్యలో ఆగిపోకుండా ఉండాలంటే శాశ్వత రెసిడెన్షియల్‌ పాఠశాలలు అదనంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది’

- కలెక్టర్ల సదస్సులో రంజిత బాషా

‘కర్నూలు జిల్లాకు భారీగా పరిశ్రమలు రాబోతున్నాయి. ఓర్వకల్లు విమానాశ్రయం, జాతీయ రహదారులు ఉండడం కలిసొచ్చిన అవకాశం. మరిన్ని జాతీయ రహదారులు ఏర్పాటు చేయబోతున్నాం. నంద్యాల జిల్లాకు నీటి సమస్య లేదు. కర్నూలు జిల్లా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటుంది. కరువు నివారణకు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఇనఫ్రాస్ట్రక్ఛర్‌ మెరుగు ప్రాధాన్యత ఇవ్వాలి. సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి కరువు నివారణపై దృష్టి సారిస్తాం’

- కర్నూలు జిల్లాపై సీఎం చంద్రబాబు

కర్నూలు, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సు చివరి రోజు బుధవారం జిల్లా ప్రగతి, చేపట్టాల్సిన పనులు, ఆయా శాఖల పురోగతి వంటి అంశాలను కలెక్టర్‌ రంజిత బాషా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. రాయలసీమ జోన-5లో తలసరి ఆదాయం వృద్ధిరేటులో కర్నూలు జిల్లా 0.5 శాతం తక్కువతో ఐదో స్థానంలో ఉందని, సేవా రంగాల్లో కూడా రాష్ట్రంలో 21 స్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రగతికి పెద్దపీఠ వేస్తున్నామని, భారీ సంఖ్యలో పరిశ్రమలు రాబోతున్నాయని వెల్లడించారు. హంద్రీనీవా ప్రాజెక్ట్‌ రాయలసీమ జిల్లాకు గేమ్‌ చేంజర్‌ అవుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. జిల్లా ప్రగతి కోసం జిల్లా కలెక్టర్‌ రంజిత బాషా ప్రతిపాదనలు చేశారు.

ప్రగతి.. ప్రతిపాదనలు:

కరువు శాశ్వత నివారణ: ఆర్డీఎస్‌ కుడి కాలువ పనులు రూ.1,988.42 కోట్లుతో చేపడితే రూ.11.99 కోట్లు, వేదవతి ప్రాజెక్టు పనులు రూ.1,988.42 కోట్లతో చేపడితే రూ.101.73 కోట్లు ఖర్చు చేశాం. 25 శాతం కంటే తక్కువ ఉండడంతో పనులు ఆపేయడం జరిగింది. హంద్రీనీవా పందికోన జలాశయం, కుడి ఎడమ కాలువ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ పనులు తక్షణమే చేపట్టాలి. గుండ్రేవుల జలాశయం నిర్మాణం కోసం రూ.4,350 కోట్లతో డీపీఆర్‌ ప్రభుత్వానికి సమర్పించాం. అంతర్‌రాష్ట్ర సమస్య ఉండడంతో తెలంగాణ, కర్ణాటకతో చర్చించాల్సిన అవసరం ఉంది.

స్మార్ట్‌సిటీ: కర్నూలు నగరం స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. రోజు 24 గంటలు తాగునీటి సరఫరాకు రూ.200 కోట్లు, ట్రాఫిక్‌ నియంత్రణకు రూ.200 కోట్లు నిధులు ఇవ్వాలి.

పల్లెకు రోడ్లు: జిల్లాలో 85 గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని ఏషియన ఇనఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏఐఐబీ) నిధులు రూ.187 కోట్లతో చేపట్టాం. రూ.36.66 కోట్లు ఖర్చు చేసి 42 పనులు పూర్తి చేశారు. రూ.80.99 కోట్లతో చేపట్టిన 23 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మరో 20 పనులు మొదలే కాలేదు. రూ.117.65 కోట్లు ఇస్తే 80 గ్రామాలకు రోడ్డు సౌకర్యం కలుగుతుంది.

కరువు ప్రాంతాల్లో రెసిడెన్షియల్‌ స్కూల్స్‌: జిల్లా పశ్చిమ ప్రాంతం గ్రామాల్లో తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు వలసలు వెళ్తున్నారు. విద్యార్థుల వలసలను ఆపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన ఫలితం ఇవ్వలేదు. 24 సీజనల్‌ హాస్టళ్లు ఏర్పాటు చేసినా.. తల్లిదండ్రులు పిల్లలను తమవెంటే తీసుకెళ్తున్నారు. విద్యార్థుల ఉజ్వల భవిత.. చదువు మధ్యలో ఆపకుండా ఉండాలంటే ఎస్సీ-6, ఈఎంఆర్‌సీ-1, ఎస్టీ-1, బీసీ-3 శాశ్వత రెడిసిడెన్షియల్‌ స్కూళ్లతో పాటు నాలుగు కేజీబీవీ పాఠశాలలు ఏర్పాటు చేయాలి.

ఆదర్శం.. వి-లర్న్‌ బోధన

జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వర్చువల్‌ (వి-లర్న్‌ డిజిటల్‌ స్టూడియో) స్టుడియోకు వివిధ పాఠశాలల్లోని వెబ్‌కామ్‌తో అనుసంధానం చేసి వర్చువల్‌ ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించి ఉపాధ్యాయుల కొరతను అదిగమించామని జిల్లా కలెక్టర్‌ పి.రంజితబాషా వెల్లడించారు. సీఎం చంద్రబాబు విజన, మానవవనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ సూచనలతో వి-లర్న్‌ స్డూడియో ఏర్పాటు చేశాం. జిల్లాలో 3 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 500 మంది హింది పండిట్లు లేరు. 10వ తరగతి బోధించే వివిధ సబ్జెట్స్‌ టీచర్లే 825 ఖాళీలు ఉన్నాయి. జిల్లాలో 350 ఉన్నత పాఠశాలలకు ఫైబర్‌నెట్‌ సౌకర్యం ఉంది. జిల్లా కేంద్రంలో వి-లర్న్‌ డిజిటల్‌ స్టుడియో ఏర్పాటు చేసి పాఠశాలలను అనుసంధానం చేశారు. వివిధ సబ్జెట్లలో ప్రావీణ్యం కలిగిన 50 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి వర్చువల్‌ ద్వారా పాఠాలు బోధించడం జరిగింది. రెండు నెలలుగా ఈ విధానం అనుసరించడంతో ఉపాధ్యాయుల కొరతను అధిగమించడం జరిగిందని, దీని ద్వారా 30 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరిందని జిల్లా కలెక్టర్‌ పి.రంజితబాషా వివరించారు. ఇది రాష్ట్రానికే ఆదర్శమని సీఎం చంద్రబాబు అభినందించారు.

ఫ తలసరి ఆదాయంలో ఐదో స్థానం

కర్నూలు జిల్లా తలసరి ఆదాయం రూ.2,24,628. 11.52 శాతం వృద్ధిరేటుతో రాయలసీమ-5లో ఐదో స్థానంలో నిలిచింది. రాష్ట్ర తలసరి ఆదాయం 12.02తో పోలిస్తే 0.5 శాతం తక్కువ నమోదు చేసుకన్నాం. 2024-25 తలసరి ఆదాయం రూ.1,92,651లు కాగా.. 2025-26లో 2,24,628లకు చేరుకొని 16.60 శాతం వృద్ధిరేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సేవల రంగాల్లో కూడా రాష్ట్రంలో 21 స్థానంలో జిల్లా ఉంది. వ్యవసాయం, పరిశ్రలు, సేవల రంగాల్లో జిల్లా స్థూల విలువ (జీడీవీఏ)లో 2024-25లో రూ.48,737 కోట్లు సాధిస్తే.. 2025-26లో రూ.56,686 కోట్లు రాబట్టి 16.31 శాతం వృద్ధిరేటు, జిల్లా స్థూల దేశీయ ఉత్పత్తి విలువ (జీడీడీఏ) 2024-25లో రూ.52,820 కోట్లు సాధిస్తే.. 2025-26లో రూ.61,746 కోట్లు రాబట్టి 16.90 శాతం వృద్ధిరేటు సాధించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు జిల్లా కలెక్టర్‌ సదస్సులో వివరించారు. జిల్లా స్థూల విలువ (జీడీవీఏ)లో వ్యవసాయం (అనుబంధ రంగాలతో కలిపి) రంగంలో 2024-25లో రూ.16,330 కోట్లు సాధిస్తే.. 2025-26లో రూ.18,985 కోట్లు రాబట్టి 16.25 శాతం, పారిశ్రామిక రంగంలో 2024-25లో రూ.10,005 కోట్లు సాధిస్తే.. 2025-26లో రూ.11,774 కోట్లు రాబట్టి 17.68 శాతం వృద్ధిరేటు, సేవల రంగంలో 2024-25లో రూ.22,402 కోట్లు సాధిస్తే.. 2025-26లో రూ.25,927 కోట్లు రాబట్టి 15.73 శాతం వృద్ధిరేటు సాధించాలనే లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు.

హంద్రీనీవా గేమ్‌ ఛేంజర్‌

- సీఎం చంద్రబాబు

రాయలసీమ జిల్లాలు కర్నూలు, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలకు హంద్రీనీవా ప్రాజెక్టు గేమ్‌ ఛేంజర్‌ కాబోతుందని కలెక్టర్ల సదస్సులో రాయలసీమ జోన-5 జిల్లాల సమీక్షా సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు విస్తరణ పనులు చేపట్టామన్నారు. జిల్లా తలసరి ఆదాయం రాష్ట్ర తలసరి ఆదాయంతో పోలిస్తే 0.5 శాతం తక్కువ ఉంది. దీన్ని అధిగమించడానికి చర్యలు చేపట్టాలి. సేవా రంగంలో కూడా రాష్ట్రంలో 21 స్థానంలో ఉంది.

జిల్లా 2025-26 కార్యాచరణ ప్రణాళిక:

ఫ అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో జిల్లా 2025-26 కార్యాచరణ ప్రణాళికను జిల్లా కలెక్టర్‌ పి.రంజితబాషా విశ్లేషించారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉత్పాదకతను పెంచేందుకు వెయ్యి హెక్టార్లలో అధిక దిగుబడి ఇచ్చే పత్తి రకాలను పండిస్తాం. తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి వచ్చేలా పత్తి, పప్పు, వేరుశనగ రకాలకు ప్రాధాన్యత ఇచ్చి 15 శాతం ఉత్పత్తి పెంచుతాం

ఫ డ్రోన్ల ద్వారా 2 వేల హెక్టార్లలో పురుగు మందులు పిచికారి. తద్వారా 30 శాతం కృత్రిమ మందుల వినియోగం తగ్గుతుంది.

ఫ 4 వేల హెక్టార్లు ప్రభుత్వ ఖాళీ భూముల్లో మొక్కలు నాటి ఒక శాతం పచ్చదనం పెంచేలా కృషి

ఫ 3 వేల చేప విత్తనాల పెంపకశాలలను పటిష్టం చేయడం. కోసిగి, ఆదోని, చిప్పగిరి, గూడూరు మండలాల్లో చేపల పెంపకాన్ని 631 ఎకరాల నుంచి వెయ్యి ఎరకాలకు విస్తరించడం

ఫ జిల్లాలో కొత్తగా 44 ఖనిజ ప్రాంతాలను గుర్తించి ఆదాయం పెరిగేలా చర్యలు

ఫ ఏఎం గ్రీన ఎనర్జీ సహకారంతో 315 మెగావాట్ల సామర్థ్యంలో విండ్‌ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటు ద్వారా 250 మందికి ప్రత్యేక్షంగా, 600 మందికి పరోక్షంగా ఉపాధి. పంప్డ్‌ హైడ్రో స్టోరేజీ పవర్‌ ప్రాజెక్ట్‌ ద్వారా 500 మందికి ప్రత్యేక్షంగా, వెయ్యి మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తాం.

ఫ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజీఎనఆర్‌ఈజీఎస్‌) కింద రూ.150 కోట్లతో 250 కిలోమీటర్లు సీసీ రోడ్డు నిర్మాణం.

ఫ దూపాడు-పాణ్యం వయా ఓర్వకల్లు మీదుగా దూపాడు నూతన రైల్వేలైన ఏర్పాటుకు చర్యలు.

ఫ సైబర్‌ స్మార్ట్‌ కాంపెయిన, డ్రోన పెట్రోలింగ్‌, శక్తి జాగృతి యాత్ర.. వంటి కార్యక్రమాల ద్వారా శాంతిభద్రతల పటిష్టం.

Updated Date - Mar 26 , 2025 | 11:36 PM