Share News

CM Jagan: జగన్ జన్మదినం నాడు.. ప్రజలకు తప్పని పాట్లు

ABN , Publish Date - Dec 21 , 2023 | 04:28 PM

సీఎం జగన్మోహన్‌రెడ్డి ( CM Jagan ) జన్మదిన వేడుకలను వేర్వేరుగా చిత్తూరులోని వైసీపీ గ్రూపులు నిర్వహించాయి. జన్మదిన వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలతో ట్రాఫిక్ స్తంభించి ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు.

CM Jagan: జగన్ జన్మదినం నాడు.. ప్రజలకు తప్పని పాట్లు

చిత్తూరు: సీఎం జగన్మోహన్‌రెడ్డి ( CM Jagan ) జన్మదిన వేడుకలను వేర్వేరుగా చిత్తూరులోని వైసీపీ గ్రూపులు నిర్వహించాయి. జన్మదిన వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలతో ట్రాఫిక్ స్తంభించి ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. చిత్తూరులోని గాంధీ విగ్రహం నుంచి తిరుపతి రోడ్డులోని ఎస్వీ సెట్ కాలేజీ వరకు గంటల తరబడి రాకపోకలు భారీగా స్తంభించాయి. ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్ ,మరో నాయకుడు భూపేష్ గోపీనాథ్ ఇతర ముఖ్య నాయకులు వేర్వేరుగాగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. 53 వేల మహిళ, డ్వాక్రా కుటుంబలకు చీరా జాకెట్ ప్యాంటు షర్టు కిట్లను అయ్యప్ప గార్డెన్‌లో ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి పంపిణీ చేశారు. కిట్లు అందుకునేందుకు మహిళలు భారీగా వచ్చారు. దీంతో అయ్యప్ప గార్డెన్ కిక్కిరిసిపోయింది. మహిళలు బారీగా రావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే అక్కడున్న మహిళా పోలీసులు చోద్యం చూస్తు అలాగే ఉండిపోయారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే 108లో హాస్పిటల్‌కి తరలించారు. చివరకి వైసీపీ నేతలు కొందరికే చీరలను పంచి పెట్టడంపై అక్కడున్న మహిళలు సీఎం జగన్‌రెడ్డిని తిట్టుకుట్టు వెళ్లారు.

Updated Date - Dec 21 , 2023 | 04:28 PM