Tirupati: శ్రీవారి సర్వదర్శనానికి డైరెక్ట్ క్యూ లైన్
ABN , First Publish Date - 2023-10-08T08:01:12+05:30 IST
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ తగ్గింది. దీంతో శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనానికి డైరెక్ట్ క్యూ లైన్ నుంచి భక్తులను పంపుతున్నారు.
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో ఆదివారం భక్తుల రద్దీ తగ్గింది. దీంతో శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనానికి డైరెక్ట్ క్యూ లైన్ (Direct Que Line) నుంచి భక్తులను పంపుతున్నారు. స్వామివారి సర్వదర్శనానికి గంట సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. కాగా నిన్న శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.50 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కాణిపాకం (Kanipakam)లో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం పుష్ప పల్లకి ఊరేగింపు ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ ఊరేగింపును తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్త జన సందోహంతో కాణిపాకం పురవీధులు కిటకిటలాడుతున్నాయి.